Home » భారీగా ప్రాపర్టీలు కొంటున్న నయనతార..!

భారీగా ప్రాపర్టీలు కొంటున్న నయనతార..!

by Azhar
Ad
సౌత్ సినిమాలలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వారిలో నయనతార కూడా ఒక్కరు. అయితే హీరోయిన్ లైఫ్ అనేది సినిమాల్లో తక్కువ కలం ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ కొందరు మాత్రం ఆ రూల్ బ్రేక్ చేస్తారు. ఆ లిస్ట్ లో నయనతార కూడా ఉంటుంది. ఇక ఈ మధ్యే నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
చాలా ఏళ్ళు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరు ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. ఇక తమ పెళ్లిని కూడా సినిమా మాదిరి ఓటీటీ సంస్థకు అమ్మిన విషయం తెలిసిందే. ఇలా నయనతార అన్ని రకాలుగా డబ్బులు అనేవి సంపాదిస్తుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గని నయనతార.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనేది వసూల్ చేస్తున్న నయనతార.. ప్రస్తుతం భారీగా ప్రాపర్టీలు కొంటున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే చెన్నైలో ఓ బంగ్లాను కొనుకున్నా నయనతార మళ్ళీ తాజాగా హైదరాబాద్ లో రెండు బంగ్లాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీరి విలువ కూడా ఒక్కో దానికి 15 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. మరి పెళ్లి తర్వాత ఇలా వరుసగా నయనతార బంగ్లాలు కొనడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది మాత్రం అర్ధం కావడం లేదు.

Advertisement

Visitors Are Also Reading