Home » న‌య‌న‌తార చెల్లెలు డ‌బ్బులోనే కాదు.. చ‌దువులో కూడా..!

న‌య‌న‌తార చెల్లెలు డ‌బ్బులోనే కాదు.. చ‌దువులో కూడా..!

by Anji
Ad

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో తాన్యా ర‌విచంద్ర‌న్ అనే పేరు తెగ వైరల్ అవుతోంది. ఈ నటి రీసెంట్ గా సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ‌గానే ఉంది. తమిళ ప్రజలకు తాన్యా రవిచంద్రన్ కొత్త ఏమీ కాదు. ఈమె తమిళ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్ మనవరాలు. తన తాత బ్యాగ్రౌండ్ మీద ఇండస్ట్రీలోకి వచ్చిన తాన్యా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో నటనకు గాను తాన్యాకు అభిమానులు కూడా బాగానే అయ్యారు.

Also Read : యూఎస్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సీనియర్ హీరోలు….ఎవరి సినిమాలకు ఎన్ని మిలియన్ డాలర్స్ వసూళ్లు వచ్చాయంటే..?

Advertisement

2016లో ‘బల్లే పెళ్ళైయితేవా’ అనే తమిళ సినిమా ద్వారా తాన్యా సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇక 2021లో విడుదలైన ‘రాజా విక్రమార్క’ మూవీ సినిమాలో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తాన్యా రవిచంద్రన్ ప్రస్తుతం తమిళ్ లో బాగా ఫేమస్ అయిన పేరు. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేదు. నటించిన ఒకటి రెండు సినిమాలతోనే తాన్యా స్టార్ హీరోయిన్ లిస్టులో పేరు సంపాదించుకుంది.

Advertisement

Also Read : “గాడ్ ఫాదర్” సినిమాలో సత్య దేవ్ పాత్రను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోలు ఎవరో తెలుసా…? ఎందుకు వదులుకున్నారు అంటే…?

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో తాన్యా నయన్ తార చెల్లెలి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా.. ఇందులో పవర్ ఫుల్ పొలిటిషన్ రోల్ పోషించింది నయన్ తార. ఇక తాన్య నయనతార చెల్లెలి పాత్ర పోషించి తన నటనతో ఆడియన్స్ ని ఆక‌ట్టుకుంది. తాన్యా వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమె కొన్ని వందల కోట్లకు వారసురాలు అని తెలుస్తోంది. ఇక చదువు విషయానికి వస్తే తాన్యా పీజీ వ‌ర‌కు చ‌దివింది. ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ హెచ్ఆర్ విభాగం తీసుకుంది. సినిమాల మీద ఆసక్తితో చివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Also Read : కాంతారా సినిమా పై రెబల్ స్టార్ ప్రభాస్ రివ్యూ.. సినిమా ఎలా ఉదంటే..?

 

Visitors Are Also Reading