Home » పెళ్లి చేసుకుని ఒక్కటైన నయనతార విఘ్నేష్ శివన్…పెళ్లిలో లక్షమందికి భోజనాలు…!

పెళ్లి చేసుకుని ఒక్కటైన నయనతార విఘ్నేష్ శివన్…పెళ్లిలో లక్షమందికి భోజనాలు…!

by AJAY
Ad

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ గత కొన్ని ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా నేడు విగ్నేష్ నయన్ లు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. గురువారం మహాబలిపురంలోని షేరిటన్ హోటల్ లో విగ్నేష్ నాయన్ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు విచ్చేశారు.

Advertisement

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్, సూపర్ స్టార్ రజినీకాంత్, దిలీప్ కుమార్, రాధిక శరత్, నిర్మాత బోనీకపూర్, దర్శకుడు అట్లీ సహా పలువురు ప్రముఖులు సినిపెద్దలు వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా నయనతార విగ్నేష్ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అతిధుల మొబైల్ ఫోన్ లు తీసుకుని వాటిని వేదిక బయటనే ఉండేలా జాగ్రత్త పడ్డారని సమాచారం.

Advertisement

సంగీత్, మెహందీ వేడుకల అనంతరం బంధుమిత్రులు అతిధుల మధ్యన వీరి వివాహం జరిగింది. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా వాటర్ బాటిల్స్ కనిపించాయి. అతిథులకు వాటర్ బాటిల్స్ పై నయనతార, విఘ్నేష్ కలిసి దిగిన ఫోటోలను అచ్చు వేశారు. అంతే కాకుండా వాళ్ల ప్రేమలో వివిధ దశలను వాటర్ బాటిల్స్ పై ప్రింట్ చేయించారు. అంతేకాకుండా వీరి వివాహం కోసం భారీగా గాజు మండపాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకైతే కేవలం ఒకటి రెండు ఫోటోలు మాత్రమే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలలో విగ్నేష్ నయన్ లు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలకు నయనతార అభిమానులు మరియు విగ్నేష్ అభిమానులు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Visitors Are Also Reading