Home » IPL 2023 : మళ్లీ రెచ్చిపోయిన నవీన్ ఉల్ హక్… కోహ్లీని టార్గెట్ చేసి!

IPL 2023 : మళ్లీ రెచ్చిపోయిన నవీన్ ఉల్ హక్… కోహ్లీని టార్గెట్ చేసి!

by Bunty
Ad

IPL 2023 ముగింపు దశకు వచ్చింది. అయితే ఐపీఎల్ 2023 భాగంగా నిన్న జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృధా అయింది.

Advertisement

యష్ థాకూర్ అసాధారణ బౌలింగ్ తో లక్నోకు విజయం అందించారు. ఇది ఇలా ఉండగా, నిన్న గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టును విరాట్ కోహ్లీ అభిమానులు వెంటాడి వేధిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో బోల్డ్, నట్లు విసిరేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా… తాజాగా కోల్కతా వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు.

Advertisement

కోహ్లీ అభిమానుల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హాక్…వారిని మరోసారి గెలికాడు. మల్లి గప్ చుప్ అని సైగలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వాడు. కోహ్లీ నినాదాలు తట్టుకోలేకపోయిన నవీన్… అవకాశం కోసం ఎదురు చూసి తమ మెంటల్ గౌతమ్ గంభీర్ తరహాలో నోటిపై వేలు వేసుకొని గమ్మునుండాలని ఫాన్స్ కు సూచించాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. కాగా, ఈ మ్యాచ్ లో నవీన్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 46 పరుగులు సమర్పించుకున్నాడు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

Bichagadu 2 : ఓటీటీలోకి ‘బిచ్చగాడు-2’ మూవీ…. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!

Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

 

Visitors Are Also Reading