Home » నాటునాటు పాట కోసం జ‌క్క‌న్న ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో తెలుసా..?

నాటునాటు పాట కోసం జ‌క్క‌న్న ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో తెలుసా..?

by AJAY

Ad

జకన్న తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలు గా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు దర్శకుడు రాజమౌళి ఈ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి కుటుంబం తో కలిసి వెళ్ళి తీసుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడం తో టాలీవుడ్ పేరు జక్కన్న పేరు ఇండియా మొత్తం మారు మోగిపోతుంది.

Advertisement

Advertisement

సినీ రాజకీయ ప్రముఖులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా దేశ ప్రధాని మోడీ సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకర్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే నాటు నాటు నాటు పాటకు అంతటి గుర్తింపు రావడంతో ఆ సినిమా నిర్మాత డివీవీ దానయ్య ఓ ఇంటర్వ్యూ లో పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ 30 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారని చెప్పాడు.

 

అంతే కాకుండా ఆ పాటను ఉక్రెయిన్ లో చిత్రించామని ఆ పాట చిత్రీకరణ కు కూడా 20 రోజులు పట్టిందని అన్నారు. ఆ ఒక్క పాట కోసమే 20 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అంతే కాకుండా ఆ పాట కోసం హీరో లతో పాటు మొత్తం 2వేల మంది పనిచేశారని చెప్పారు. రాజమౌళి పైన ఉన్న నమ్మకం తోనే ఖర్చు విషయం లో వెనకడుగు వేయలేదు అని చెప్పారు.

Visitors Are Also Reading