పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈయన నటనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
పవన్ కళ్యాణ్ కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దీంతో తమిళ ఇండస్ట్రీలో అతని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కళారంగానికి భాషా, ప్రాంతం అనే హద్దులు ఉండకూడదని, అందరూ కలిసి ఎదగాలని, ఎలాంటి హద్దులు పెట్టకుండా ఉండడం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదిగిందని పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ వాక్యాలు తమిళ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
పవన్ వాక్యాలపై స్పందిస్తూ…నటుడు నాజర్ స్పందించాడు. కొంతమంది తమ నిర్ణయాన్ని వక్రీకరిస్తున్నారు అని అన్నాడు. టాలీవుడ్ నీ తొక్కేసేలా ఎలాంటి నిర్ణయాలు కోలీవుడ్ ఇండస్ట్రీ తీసుకోలేదని….పక్క ఇండస్ట్రీ ఆర్టిస్టులను తమిళ ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు తమిళంలో సినిమాలు చేశారు అని నాజర్ స్పందించారు.
ఇవి కూడా చదవండి
“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!
కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్రైజర్స్ పై రజినీకాంత్ సంచలనం