Home » Malli Pelli Review in Telugu : మళ్ళీ పెళ్లి రివ్యూ.. ఎలా ఉందంటే ?

Malli Pelli Review in Telugu : మళ్ళీ పెళ్లి రివ్యూ.. ఎలా ఉందంటే ?

by Anji
Ad

ప్రముఖ నటుడు విజయ కృష్ణ నరేష్ అలియాస్ వికే నరేష్ తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. వివాదస్పద చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నరేష్ అతని నుంచి విడిపోయిన మూడో భార్య రమ్య రఘుపతి మరియు లైవ్ ఇన్ పార్ట్ నర్ పవిత్ర లోకేష్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ  రమ్య రఘుపతి నరేష్ కి నోటీసులు జారీ చేసింది. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

నటీనటులు :  నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ, భద్రమ్ తదితరులు.

దర్శకుడు : ఎం.ఎస్.రాజు

నిర్మాత : నరేష్

సంగీతం : సురేష్ బొబ్బిలి

పాటలు : అనంత శ్రీరామ్

సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి

ఎడిటింగ్ : జునైద్ సిద్ధిక్యూ

కథ : 

నరేష్, పవిత్ర లోకేష్ గురించి ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నరేష్ ఎక్స్ వైప్ పాత్రలో వచ్చేసి నటుడు విజయ్ కుమార్ గారి కూతురు వనిత విజయ్ కుమార్ నటించారు. నిర్మాత ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నరేష్ సొంతంగా నిర్మించారు. రియల్ లైఫ్ స్టోరీనే సినిమాగా చేశారు.  ఇటీవల నరేష్, పవిత్రలోకేష్, రమ్య రఘుపతి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కథ చెప్పడం కంటే సినిమాని థియేటర్ లో వీక్షించడమే బెటర్. నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో ఈ కథ సాగింది.  నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది ఏంటీ అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించినట్లుగా తెలుస్తోంది. నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు, నరేష్-పవిత్ర ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన అనేక సన్నివేశాల ఆధారంగానే తెరకెక్కింది.

Advertisement

విశ్లేషణ :

ఈ సినిమా నిజజీవితం ఆధారంగా తెరకెక్కడంతో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టుకు ఎక్కడం కూడా ఆసక్తి నెలకొంది. కానీ ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది.  ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్, వనిత అద్భుతంగా నటించారు. నరేష్ న్యాయం చేయలేకపోయాడు. ఫస్టాప్ మొత్తం ఒక ల్యాగ్ లా వెళ్లిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి అరగంట ముందు సినిమా సూపర్ ఉంటుంది. కొన్ని ట్విస్ట్ లు, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో భార్యను మంచిగా చూపించారు. పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ని చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి ట్రయాంగిల్ డ్రామా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ మూవీలో మనకు కావాల్సిన కంటెంట్ అంతా దొరికేసింది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బీజీఎం బాగానే ఉంది. నరేష్ స్టోరీ తెలియని వారికి మాత్రం సినిమా అంతగా కనెక్ట్ కాదు. సెకండాఫ్ లో నరేష్, పవిత్ర లవ్ సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. వాన సినిమా క్లైమాక్స్ తోనే హిట్ మిస్ చేసుకున్న ఎం.ఎస్.రాజు మళ్ళీ పెళ్లితో హిట్ కొడతాడేమో వేచి చూడాలి. 

ప్లస్ పాయింట్స్ : 

  • నరేష్, పవిత్ర నటన
  • క్లైమాక్స్
  • లవ్ సీన్స్

మైనస్ పాయింట్స్ : 

  • సాగదీత
  • ఫస్టాప్
  • నిజజీవితంలో ఉన్న ఆసక్తి లేకపోవడం

రేటింగ్ : 2.5/5

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Mem Famous Review in Telugu : ‘మేమ్ ఫేమస్’ రివ్యూ.. హిట్ అయ్యేనా ?

 మహేష్ బాబు “ఒక్కడు” సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading