Home » Pavitra Lokesh: న‌రేష్ ప‌విత్ర‌ల ల‌వ్ స్టోరీ ఎలా మొద‌ల‌య్యిందో తెలుసా…?

Pavitra Lokesh: న‌రేష్ ప‌విత్ర‌ల ల‌వ్ స్టోరీ ఎలా మొద‌ల‌య్యిందో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

Pavitra Lokesh: ప్ర‌స్తుతం న‌రేష్ ప‌విత్రా లోకేష్ ల ప్రేమ పెళ్లి వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా న‌రేష్ ప‌విత్ర‌లు డేటింగ్ లో ఉన్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా అనేక సంధ‌ర్భాల్లో ఇద్ద‌రూ మీడియా కంట ప‌డ్డారు. ఇక రీసెంట్ గా కొత్త సంవ‌త్స‌రంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం…త్వ‌ర‌లోనే మా పెళ్లి అంటూ న‌రేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక ఈ వీడియోలో ఇద్ద‌రూ ముద్దు పెట్టుకోవ‌డం తో అంతా అవాక్క‌య్యారు.

Advertisement

ఇంత ఓవ‌ర్ అవ‌స‌ర‌మా…లేటు వ‌య‌సులో అస‌లు పెళ్లి అవ‌స‌రమా అంటూ ర‌క‌ర‌కాల కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో న‌రేష్ త‌న‌కు ప‌విత్ర‌తో ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింది ఎలా క‌లుసుకున్నారో చెప్పుకొచ్చాడు.ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో నరేష్ మాట్లాడుతూ….మొద‌టిసారి హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా షూటింగ్ లో ప‌విత్ర లోకేష్ ను క‌లుసుకున్నాను.

Advertisement

ఆమె నా కొలిక్….ఆమె చాలా సైలెంట్ గా ఉండే మ‌హిళ మొద‌టి సారి చూసిన‌ప్పుడు ఓ పుస్తకం చ‌దువుతూ క‌నిపించింది. నాతో ఎక్స్ట్రా రెండు ప‌దాలు కూడా మాట్లాడ‌లేదు. నేను మొద‌ట ఆమెతో మాట్లాడేందుకే కష్ట‌ప‌డ్డాను. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో రెండుమూడు సార్లు మాత్ర‌మే మాట్లాడుకున్నాము.

ఆ త‌ర‌వాత అదృష్టం కొద్ది స‌మ్మోహ‌నం సినిమాలో క‌లిసి నటించే ఛాన్స్ వ‌చ్చింది. ఓ రోజు నేను డైలాగ్ చెప్ప‌లేని స్థితిలో బాధ‌ప‌డుతూ ఉంటే గ‌మ‌నించి ఏమైంది సార్ అంటూ మాట్లాడింది. ఆ త‌ర‌వాత నా బాధ‌ను త‌న‌కు చెప్పాను..త‌న బాధ‌ను నాకు చెప్పింది. అలా మా ఇద్ద‌రి మ‌ధ్య బంధం ఏర్ప‌డి మంచి స్నేహితులం అయ్యాం…అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.

ALSO RAED : తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసిన శ్రీజ… నెట్టింట వైరల్….,!

Visitors Are Also Reading