Home » అంద‌రికంటే మోహ‌న్ బాబు మిన్న‌..ఆయ‌నే పెద్ద‌దిక్కు : న‌రేష్

అంద‌రికంటే మోహ‌న్ బాబు మిన్న‌..ఆయ‌నే పెద్ద‌దిక్కు : న‌రేష్

by AJAY
Ad

టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవ‌ర‌నే ప్ర‌శ్న కొంత‌కాలంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాస‌రి నారాయ‌ణ త‌ర‌వాత ఇండ‌స్ట్రీలో ఏ స‌మ‌స్య‌లు వ‌చ్చినా చెప్పుకోవ‌డానికి ఎవ‌రూ లేర‌ని ఒక‌రు ఉంటే బాగుండేద‌ని మా ఎన్నిక‌ల స‌మ‌యంలో పలువురు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కెవ‌రు అని చ‌ర్చ జ‌రుగుతున్న సమ‌యంలో న‌టుడు న‌రేష్ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. స‌న్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో న‌రేష్ మాట్లాడుతూ….అంద‌రికంటే మోహన్ బాబు మిన్న అని అన్నారు. మోహన్ బాబు సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కు అని వ్యాక్యానించారు.

Advertisement

Advertisement

సినిమా ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌న్న‌…అంద‌రికీ అన్న అంటూ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ లో గొప్ప హీరోలున్నార‌ని..గొప్ప విల‌న్ లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు ఉన్నార‌ని కానీ అన్నీ క‌లిసిన ఒకే వ్య‌క్తి మోహ‌న్ బాబు అని కొనియాడారు. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పారు. రైతు కుటుంబంలో జ‌న్మించి ఉపాద్యాయుడిగా ప‌నిచేసి యూనివ‌ర్సిటీ స్థాపించే స్థాయికి ఎదిగార‌ని చెప్పారు. మోహ‌న్ బాబు సినిమా కోసం బ‌తికే వ్య‌క్తి కాద‌ని సినిమా కోసం పుట్టిన వ్య‌క్తి అంటూ న‌రేష్ ప్ర‌శంస‌లు కురింపించారు.

Visitors Are Also Reading