Home » ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న హీరోల్లో ఉద‌య్ కిర‌ణ్ కూడా ఒక‌రు. ఉద‌య్ కిర‌ణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్నారు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. అంతే కాకుండా స్టార్ ద‌ర్శ‌కులు త‌న డేట్స్ కోసం ఎద‌రు చూసే స్థాయికి ఉద‌య్ కిర‌ణ్ చేరుకున్నారు. ఫ్యామిలీకి ఇండ‌స్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోయానా ఒక్కడే వ‌చ్చిన ఉద‌య్ కిర‌ణ్ తిరుగులేని హీరోగా మారిపోయారు. కానీ ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌ముకం ప‌ట్టాయి.

also read : ANUSHKA SHETTY : టాలీవుడ్ లో హీరోయిన్ల‌ను లోబ‌ర్చుకునే సంస్కృతి…అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Advertisement

udaykiran

udaykiran

ఈ క్రమంలో వివాహం చేసుకోవడం….అక్క‌డ కూడా స‌మస్య‌లు ఎదుర‌వ‌డం ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు దూరం అయ్యారు. అయితే ఉద‌య్ కిర‌ణ్ కు ఇండ‌స్ట్రీ లో ఉన్న స్నేహితుల్లో హీరో న‌రేష్ కూడా ఒక‌రు. న‌రేష్ ఉద‌య్ కిర‌ణ్ గురించి ఓ ఇంట‌ర్య్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయే ముందు హీరో న‌రేష్ ఆయ‌న‌ను క‌లిశార‌ట‌.

Advertisement

Also read : ఆ దేశంలో ల‌వ్ ఎమోజీ పంపితే రూ.20 ల‌క్ష‌ల ఫైన్….!

అప్పుడు ఉద‌య్ కిర‌ణ్ డ‌ల్ గా క‌నిపించార‌ట‌. దాంతో ఎందుకు ఉద‌య్ అలా డ‌ల్ గా క‌నిపిస్తున్నావ్ అని ప్ర‌శ్నిచంగా…పేప‌ర్ లో యంగ్ హీరో క‌థ‌లు సరిగ్గా ఎంచుకోవ‌డం లేద‌ని రాసార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ట‌. దానికి న‌రేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు…నీకు సంబంధించిన విష‌యం కాదు క‌దా అని అన్నార‌ట‌.

దాంతో ఉద‌య్ కిర‌ణ్ ఆ యంగ్ హీరో క‌థ‌లు స‌రిగ్గా ఎంచుకోక‌పోతే అత‌డికి కూడా ఉద‌య్ కిర‌ణ్ కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని బాధ‌ప‌డ్డాడ‌ట‌. దాంతో న‌రేష్ ఎంతో ఉద్వేగానికి గురయ్యార‌ట‌. ఉద‌య్ కిర‌ణ్ ఎంతో డిప్రెష‌న్ లో ఉన్నార‌ని అర్థ‌మైంద‌ట‌. ఇక ఉద‌య్ కిర‌ణ్ చనిపోయిన త‌ర‌వాత అత‌డి మృతికి డిప్రెష‌న్ కూడా కార‌ణ‌మ‌ని న‌రేష్ కు అనిపించింద‌ని చెప్పాడు.

Visitors Are Also Reading