Home » Narakasura Movie Review : నరకాసుర మూవీ రివ్యూ.. ట్విస్టులు అదుర్స్

Narakasura Movie Review : నరకాసుర మూవీ రివ్యూ.. ట్విస్టులు అదుర్స్

by Anji
Ad

Narakasura Movie Review in Telugu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవాళ నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రక్షిత్ అట్లూరి హీరోగా.. తెరకెక్కిన తాజా చిత్రసెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నరకాసుర. ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు సెబాస్టియన్.

Advertisement

నటీనటులు : రక్షిత్,  అపర్ణ జనార్థన్, నాజర్, సంగీర్తన, చరణ్ రాజ్, ఎస్.ఎస్.కాంచి, శ్రీమన్, ఫిష్ వెంకట్ తదితరులు.

దర్శకత్వం : సెబాస్టియన్ నోవా అకోస్టా

నిర్మాత : డా.అజ్జా శ్రీనివాస్

సంగీతం : నౌపాల్ రాజా

సినిమాటోగ్రాఫర్ : నాని చామిడి శెట్టి

ఎడిటింగ్ : సీ.హెచ్. వంశీ కృష్ణ

Narakasura Movie Story  కథ : 

నరకాసున మూవీ ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కాఫీ, మిరియాల ఎస్టేట్ నేపథ్యంలో కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్నతనంలో డైరెక్టర్  తప్పిపోతే ట్రాన్స్ జెండర్స్ వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారట దర్శకుడు.  రూరల్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ మూవీలో శివ (రక్షిత్) ఓ ట్రక్ డ్రైవర్. అలాగే మిరియాల పంట్ల హార్వెస్టర్ కూడా. అకస్మాత్తుగా అతను కనుమరుగు అవుతాడు. అసలు అతను అదృశ్యం కావడానికి కారణం ఏంటి అనే కోణంలో కథ తిరుగుతుంది. ఇక్కడే ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. ట్రాన్స్ జెండర్స్ పరిపాలించే రాజ్యంలోకి శివ ఎలా వెళ్తాడు.. అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరూ వ్యక్తులు తమ హక్కుల కోసం పోరడటానికి విబేదాలను పక్కకు పెడతారు. ఎందుకు పోరాడుతారు. ట్రాన్స్ జెండర్స్ కి శివకి ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ మూవీని థియేటర్లలో వీక్షించాల్సిందే.

Advertisement

Narakasura Movie  విశ్లేషణ : 

ఈ సినిమాలో రక్షిత్, అపర్ణ జనార్దన్, నాజర్  కీలక పాత్రల్లో నటించారు. శివ గా రక్షిత్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక అపర్ణ జనార్దన్ కూడా చాలా లోతైన పాత్రలో నటించి మెప్పించారు. దర్శకుడు సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్ ఓ వైపు సాంఘిక అంశాలను ప్రస్తావిస్తూనే సినిమాను చాలా రసవత్తరంగా తీర్చిదిద్దారు. సెన్సిటివ్ సబ్జెక్ట్‌లను డెప్త్‌గా, సెన్సిటివిటీతో చిత్రీకరించడంలో దర్శకుడి సామర్థ్యానికి ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తోంది. కాఫీ,  పెప్పర్ ఎస్టేట్ యొక్క సెట్టింగ్ కూడా చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ ట్రాక్ లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యంగా ఈ మూవీలో ట్విస్ట్ లు చాలానే ఉన్నాయని చెప్పాలి.

 

నవంబర్  03న విడుదలైన కీడా కోలా  సినిమాకి ప్రీమియర్స్ ద్వారా నెగిటివ్ రెస్పాన్స్ రావటంతో నరకాసుర మూవీకి మరింత ప్లస్ అయిందనే చెప్పవచ్చు . వాస్తవానికి ఎబోవ్ యావరేజ్ కంటెంట్ ఉన్న ఈ సినిమా కీడకోలా ఫెయిల్యూర్ అవ్వటం వల్ల హిట్ దిశగా అడుగులేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చేతికి గాయం అయినప్పటికీ వెనకడుగు వేయకుండా సినిమా కంప్లీట్ చేసినందుకు గాను తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు వీక్షించవచ్చు.  ఎక్కువగా ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ  ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందనే చెప్పవచ్చు. 

 

ప్లస్ పాయింట్స్ : 

  • రక్షిత్ నటన
  • కాఫీ తోటలు
  • ట్విస్ట్ లు
  • డైరెక్టర్

మైనస్ పాయింట్స్ 

  • కాస్త నెమ్మదిగా సాగడం
  • సాగదీత

రేటింగ్ : 2.5/ 5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading