ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని, అడ్డగోలుగా ఇష్టంవచ్చినట్టు తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థుల దాడి, అమరావతి రైతులపై లాఠీచార్జీ అమానుష ఘటన అని ఫైరయ్యారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటికి రాగలరా అని ప్రశ్నించారు లోకేష్.
Advertisement
Advertisement
వైసీపీ నేతలు పిరికి వారని, పిల్లలంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి. తమ నాన్న చంద్రబాబు చాలా సాప్ట్ అని, నేను సాప్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ప్రజా ఉద్యమం రానున్నదని, అందులో గాలిగాడు జగన్ కొట్టుకుపోతాడని పేర్కొన్నారు. 2024లో ఏపీలో టీడీపీ విజయం ఖాయమని, దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు లోకేష్. కుప్పం ఎన్నికలకు రౌడిలు, స్మగ్లర్లు దిగారని ఆగ్రహం వ్యక్తం చేసారు.