టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ ఒకటి వచ్చింది అది అదిరిపోయింది. ఎందుకంటే క్రిస్మస్ కానుకుని ఎవరు పంపించారు అంటే… వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. మరి క్రిస్మస్ గిఫ్ట్ కింద ఆమె ఏం పంపించారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. క్రిస్మస్ ని పురస్కరించుకుని లోకేష్ కి షర్మిల ఒక కానుక పంపించారు. వైయస్సార్ ఫ్యామిలీ నుండి లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
ఒక నోట్ ని కూడా పంపించారు షర్మిల పంపిన క్రిస్మస్ కానుకుని అందుకున్న లోకేష్ చాలా సంతోష పడ్డారు క్రిస్మస్ కానుక పంపించిన షర్మిల కి థాంక్స్ చెప్పారు. తన ఫ్యామిలీ తరఫున షర్మిల కి ఆమె కుటుంబ సభ్యులకు క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇక నోట్స్ లో ఏముంది అనేది చూస్తే…
Advertisement
Dear @realyssharmila Garu,
Please accept my heartfelt thanks for the wonderful Christmas gifts. Nara family wishes you and your family Merry Christmas and a Happy New Year. pic.twitter.com/4yn4SiGcjv— Lokesh Nara (@naralokesh) December 24, 2023
ఆ నోట్ లో ” ప్రభువైన ఏసు క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ,సహనం ప్రతీ ఒక్కరిలో పెంపొందాలి…. అలానే కరుణామయుడైన క్రీస్తు మనకు అందించిన శాంతి సందేశం సమాజానికి పంచి ప్రపంచశాంతికి దోహదపడాలి అని రాసి వుంది. క్రీస్తు చూపిన మార్గమైన దయ, త్యాగగుణం ప్రతీ ఒక్కరూ అలవర్చుకున్నప్పుడే జీవితం సంతోషమయం అవుతుంది” ఇలా ఆ నోట్ లో ఈ విధంగా రాసి ఉంది క్రిస్మస్ సందర్భంగా క్రైస్తువులందరికీ శుభాకాంక్షలు దయామయుడు లోకానికి వచ్చిన పర్వదినమైన క్రిస్మస్ పండుగ అని ఆనందోత్సాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేష్ విషెస్ ను తెలిపారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!