Home » మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో నాని ద‌స‌రా సినిమా రెమ్యున‌రేష‌న్… మొత్తం ఎన్ని కోట్లంటే..?

మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో నాని ద‌స‌రా సినిమా రెమ్యున‌రేష‌న్… మొత్తం ఎన్ని కోట్లంటే..?

by AJAY
Ad

నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ద‌స‌రా. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడు కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు సినిమా ట్రైల‌ర్ మ‌రియు పాట‌లు కూడా ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా పై అంచ‌నాలు మ‌రిన్ని పెరిగాయి. కాగా మార్చి 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

ALSO READ : ఐపీఎల్ లో రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ కీలక ప్లేయర్ ఎవరో తెలుసా ?

Advertisement

సినిమాకు నైజాంలో క్రేజ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో దిల్ రాజు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు క‌న్న‌డ నాట కూడా క్రేజ్ ఓ రేంజ్ లో వ‌చ్చింది. దాంతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో దస‌రా రైట్స్ ను కేజీఎఫ్ లాంటి భారీ సినిమాను నిర్మించిన హోంబ‌లే ఫిల్మ్స్ ద‌క్కించుకుంది.

Advertisement

మ‌రోవైపు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను కూడా ఓటీటీ సంస్థ‌లు భారీ మొత్తానికి కొనుగోలు చేశాయి. ఈ సినిమా తెలుగు త‌మిళ క‌న్న‌డ భాష‌ల‌కు చెందిన స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకోగా…హిందీ సినిమా రైట్స్ ను హాట్ స్టార్ ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమా విడ‌ద‌లైన త‌ర‌వాత స‌రిగ్గా ఎనిమిది వారాల‌కు ఆయా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి నాని కూడా రెమ్యున‌రేష‌న్ త‌న గ‌త సినిమాల కంటే చాలా ఎక్కువ తీసుకున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నాని రూ.15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడాని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి కూడా ర‌క‌ర‌కాల వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ దాదాపు 15 నిమిషాలు ఉంటుంద‌ట‌. అదేవిధంగా సినిమాలోని చాలా సీన్ ల‌కు సెన్సార్ విధించిన‌ట్టు కూడా తెలుస్తోంది.

ALSO READ : వినోద‌య సీత‌మ్ రీమేక్..ప‌వ‌న్ పక్క‌కు జ‌ర‌గ‌డంతో డూప్ తో షూటింగ్..!

Visitors Are Also Reading