Home » ప్లాప్ డైరెక్టర్ తో నాని కొత్త సినిమా..?

ప్లాప్ డైరెక్టర్ తో నాని కొత్త సినిమా..?

by Azhar
Ad

టాలీవుడ్ లోకి ఎటువంటి అండా లేకుండా వచ్చిన హీరోలు ఎవరంటే అందరూ ముందు రవితేజ.. ఆ తర్వాత నాని పేరు చెబుతారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి ఈరోజు టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నానిగా ఎదిగాడు. అయితే నాని వరుస సినిమాలు అనేవి ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ముందు. ఇక ఇప్పటివరకు ఆ ప్రకటించిన సినిమాలను ఒక్కొకటి పూరి చేస్తూ వస్తున్నాడు.

Advertisement

అయితే మొదట శ్యామ్ సింగరాయ్ విడుదల చేసి హిట్ అందుకున్న నాని.. తర్వాత టాక్ జగదీష్ ఈ మధ్యే అంటే సుందరానికి అనే సినిమాలు చేసాడు. కానీ అవి పెద్దగా ఆడలేదు. ఇక ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మొత్తం మాస్ యాంగిల్ లో కొత్తగా కనిపించబోతున్నాడు నాని. అయితే ఈ సినిమా తర్వాత నాని ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది.

Advertisement

టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కానీ విధంగా వరుసగా 8 హిట్స్ అందుకున్న నాని.. యొక్క లయను కృష్ణార్జున యుద్ధం అనే సినిమా దెబ్బ తీసింది. ఈ సినిమాతో నానికి ప్లాప్ అనేది ఇచ్చాడు మేర్లపాక గాంధీ. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే దర్శకునితో నాని సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా కథ ఎలా ఉంటుంది.. ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది చుడాలీల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

గంగూలీపై విరుచుపడ్డ గంభీర్.. అది తప్పు అంటూ..?

కోహ్లీ గతమే బాబర్ కు భవిష్యత్..?

Visitors Are Also Reading