Home » సింగ‌రేణి బొగ్గు గ‌ని కార్మికుడి జీవిత క‌థ‌లో నాని..!

సింగ‌రేణి బొగ్గు గ‌ని కార్మికుడి జీవిత క‌థ‌లో నాని..!

by Anji
Ad

న్యాచుర‌ల్ స్టార్ నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌రే లేదు. ఈ మ‌ధ్య‌నే రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన‌ శ్యామ్‌సింగ‌రాయ్ వంటి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ఈ ఏడాదికి వెల్‌క‌మ్ చెప్పారు. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వీ, ట‌క్ జ‌గదీశ్ వంటి వ‌రుస ప్లాప్‌ల త‌రువాత నానికి శ్యామ్ సింగ‌రాయ్ సూప‌ర్ హిట్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాని, సాయిప‌ల్లవి జంట‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Nani, Aishwarya Rajesh and Ritu Varma's Tuck Jagadish to release on OTT |  The News Minute

Advertisement

Advertisement

ఇక ఈ చిత్రం త‌రువాత నాని వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ పూర్తి చేశాడు నాని. స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో నాని మ‌రొక ప్ర‌యోగం చేయ‌నున్నారు. నాని మాస్ లుక్ క‌నిపించి అభిమానుల‌ను ఆక‌ట్టుకోనున్నాడు. కోర‌మీసం, గుబురు గ‌డ్డంతో మాస్ యాటిట్యూడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా శ్రీ‌కాంత్ ఓదెల ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా క‌థాంశం పూర్తిగా ప‌ల్లె నేప‌థ్యంలో కొన‌సాగుతుంద‌ట‌. తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గుగ‌ని ప్రాంతంలో ఓ ప‌ల్లెటూరి క‌థ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని బొగ్గు గ‌ని కార్మికునిగా క‌నిపించ‌నున్నార‌ని ఫిల్మ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఆగ‌స్టు నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం.

Visitors Are Also Reading