గత కొన్ని రోజులుగా.. ఏపీ ప్రభుత్వం మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య టికెట్ల పై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రెండు రోజుల కిందట… టికెట్ల రేట్లపై ఏపీ సర్కార్ పై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరాణా కొట్టు కంటే.. థియేటర్ల యాజమానుల ఆదాయం తగ్గిందంటూ జగన్ సర్కార్ కు చురకలు అంటించారు. దీంతో నాని పై ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు.
Advertisement
అయితే..ఈ వివాదం పై ముగియకముందే.. నాని మరో మారు హట్ కామెంట్స్ చేశారు. ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పానని… దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారని ఫైర్ అయ్యారు నాని. సమస్య అనేది నిజమని.. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలని కోరారు.
Advertisement
కానీ టాలీవుడ్లో ఐకమత్యం లేదని అంసతృప్తి వ్యక్తం చేశారు నాని. వకీల్ సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేదని హీరో నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.