Home » హిట్ 3వ కేసు.. హీరో ఎవరంటే..?

హిట్ 3వ కేసు.. హీరో ఎవరంటే..?

by Azhar
నాచురల్ స్టార్ నాని హీరోగా మంచి క్లాసిక్ విజయాలు అందుకున్నాడు అనే విష్యం తెలిసిందే. అయితే హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. వరుస హిట్స్ అనేవి కొడుతున్న సమయంలో నాని కొత్త అవతారం ఎత్తాడు. అదే నిర్మాత. వాల్పేపర్ ప్రొడక్షన్ ను స్థాపించిన నాని అ! అనే సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నేరుగా హిట్ అనే పేరుతోనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హిట్ సెకండ్ కేస్ అంటూ దీని సీక్వెల్ ను కూడా ప్రారంభించాడు నాని. ఈ సినిమాకు కూడా మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ డైరెక్షన్ చేస్తుండగా.. హీరో మాత్రం మారిపోయాడు. హిట్ సెకండ్ కేస్ లో అడవి శేష్ హీరోగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనేది ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతుంది.
ఇక ఈ సమయంలో మళ్ళీ ఈ సినిమాకు కూడా సీక్వెల్ అనేది ఉంటుంది అని తెలుస్తుంది. హిట్ 3వ కేస్ గా ఆ సినిమా అనేది శైలేష్ డైరెక్షన్ లోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ మొదటి సినిమా రెండవ సినిమాకు హీరో మారినట్లే మూడవ సినిమాలో కూడా హీరో మారిపోనున్నట్లు సమాచారం. అయితే ఈ మూడో సినిమాలో నిర్మాత అయిన నానినే స్వయంగా హీరోగా చేయనున్నట్లు తెలుస్తుంది.
Visitors Are Also Reading