Home » అంతకు మించి అంటున్న నాని..!

అంతకు మించి అంటున్న నాని..!

by Azhar
Ad
టాలీవుడ్ లోకి ఏ సపోర్ట్ అనేది లేకుండా వచ్చి ఇప్పుడు టాప్ హీరోలలో ఒక్కడిగా కొనసాగుతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా వరుసగా 8 సినిమాలు హిట్ కొట్టాడు నాని. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నాని సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి. కానీ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. సినిమాలను నిర్మిస్తున్నాడు కూడా.
వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థ పెట్టి మొదట అ! అనే సినిమా చేసిన నాని.. ఆ తర్వాత హిట్ అనే సినిమాను నిర్మించాడు. యువ దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనేది పేరు తగ్గిన విధంగానే సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ హిట్ 2 లో అడవి శేష్ హీరోగా చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంత కంప్లిట్ కాగా.. సినిమా రష్ చూసాను అని.. నానా కొత్త లుక్ సూపర్ గా ఉంది అని శేష్ ట్విట్ చేసాడు. అయితే ఈ ట్విట్ పై స్పందించిన నాని.. త్వరలోనే ఈ సినిమా టీజర్ అనేది విడుదల చేస్తాం అని పేర్కొన్నాడు. అలాగే మొదటి సినిమా హిట్ కంటే అంతకు మించిన లెవల్ లో ఈ హిట్ 2 ఉంటుంది అని కూడా నాని తెలిపాడు.

Advertisement

Visitors Are Also Reading