Home » హిట్ యూనివర్స్ లోకి బాలయ్య ? సస్పెన్స్ థ్రిల్లర్ తో భయపెట్టనున్నాడా ?

హిట్ యూనివర్స్ లోకి బాలయ్య ? సస్పెన్స్ థ్రిల్లర్ తో భయపెట్టనున్నాడా ?

by Anji
Ad

వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు మరో భారీ విజయాన్ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కామెడీ ప్రధాన అంశంగా చిత్రాలను రూపొందించిన అనిల్ ఇప్పుడు బాలయ్యతో ఫుల్ మాస్ యాక్షన్ సినిమాకి చేస్తున్నారు. కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే ఎక్కువగానే అంచనాలున్నాయి. ఎప్పుడూ మాస్ మూవీస్ చేసే బాలయ్య.. ఇప్పుడు జోనర్ మార్చేసినట్టు తెలుస్తోంది.  

Advertisement

ఈ నేపథ్యంలోనే సీనియర్ దర్శకుడు మాత్రమే యంగ్ దర్శకుల్లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాాజాగా బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.  టాలెంటేడ్ దర్శకుడు శైలేష్ కొలన్ ప్రారంభించిన ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ హిట్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించింద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ పార్ట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించగా.. సెకండ్ పార్ట్ లో అడివి శేష్ నటించారు. త్వరలో హిట్ పట్టాలెక్కనుంది. ఇందులో నేచురల్ స్టార్ నాని నటించనున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. 

Advertisement

తాజాగా సమాచారం ప్రకారం.. ఈ యూనివర్స్ లో నందమూరి హీరో బాలకృష్ణ సైతం భాగం అవుతున్నారు. హిట్ యూనివర్స్ నాలుగో సినిమా ఉంటుందని.. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. నాలుగో పార్ట్ హీరో రోల్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని.. అలాంటి పాత్రలో బాలయ్య ఉంటే తన మూవీ నెక్ట్స్ లెవల్ మాస్ అంటున్నారు. అధికారికంగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ రూమర్స్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. 

మరికొన్ని ముఖ్య వార్తలు : 

29 ఏళ్ల యువతితో,83 ఏళ్ల ఏజ్ లో తండ్రి కాబోతున్న ఫాసినో..!

తనకంటే పెద్ద వయసు హీరోయిన్ కు తల్లిగా చేస్తున్న సమంత..!!

 

Visitors Are Also Reading