Home » న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!

న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!

by AJAY
Ad

సినిమా తార‌ల వార‌సులు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం సాధార‌ణ‌మే. అయితే చాలా మంది వార‌సులు మాత్రం చిన్న‌వ‌య‌సులో స్క్రీన్ కు దూరంగా ఉంటారు. కానీ కొంత‌మంది వారసులు చాలా యాక్టివ్ గా ఆస‌క్తితో ఉంటారు. అందువ‌ల్లే చిన్న‌త‌నంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు త‌న‌యుడు గౌత‌మ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు సితార‌ కూడా స‌ర్కారు వాటి పాట సినిమాతో బిగ్ స్క్రీన్ పై క‌నిపించ‌బోతుంది.

Advertisement

సితార ఇప్ప‌టికే త‌న రీల్స్ తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్కారువారి పాట సినిమాలో సితార పెన్సీ సాంగ్ లో డ్యాన్స్ చేసింది. ఇక తాజాగా ఈ విష‌యంపై మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త స్పందించారు. ఓ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త మాట్లాడుతూ…సితార ఎంట్రీ విష‌యంలో చాలా కంగారుప‌డ్డామ‌ని అన్నారు. సితార‌కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమ‌ని డ్యాన్స్ లో శిక్ష‌ణ కూడా తీసుకుంటుంద‌ని చెప్పారు.

Advertisement

సోష‌ల్ మీడియాలో తాను చేసిన డ్యాన్స్ వీడియోల‌ను సితార షేర్ చేస్తూ ఉంటుంద‌ని చెప్పారు. స‌ర్కారు వారి పాట సినిమా నుండి మొద‌ట క‌ళావ‌తి పాట విడుద‌లైంద‌ని ఆ పాట‌కు న‌మ్ర‌త వేసిన స్టెప్పులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయ‌ని చెప్పారు. ఆ వీడియో చూసిన థ‌మ‌న్ మ‌హేశ్ బాబుతో సితార‌తో పెన్నీ వీడియో చేయిద్దామ‌ని చెప్పిన‌ట్టు తెలిపారు.

ఆ విష‌యం సితార‌కు చెప్ప‌గా చాలా సంతోష‌ప‌డింద‌ని అన్నారు. అలా సితార పెన్నీ సాంగ్ లో స్టెప్పులు వేసింద‌ని చెప్పారు. నిజానికి ముందు తాము చాలా కంగారు ప‌డ్డామ‌ని చెప్పారు. ముందు షూట్ చేసి సాంగ్ స‌రిగ్గా రాక‌పోతే రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని భావించిన‌ట్టు చెప్పారు. కానీ సితార డ్యాన్స్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని తెలిపారు.

ALSO READ : 

“నువ్వునాకు న‌చ్చావ్” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా…!

అతి చిన్న వయసులో ప్రాణాలని వదిలేసిన ఈ 10 మంది నటులు ఎవరో తెలుసా ? వారి మృతికి కారణాలు

 

Visitors Are Also Reading