Telugu News » Blog » NAMITHA : శ‌ర‌త్ బాబుతో న‌మిత పెళ్ళి అంటూ వార్త‌లు…వ‌ర‌స్ట్ అంటూ న‌మిత భ‌ర్త అస‌హ‌నం..!

NAMITHA : శ‌ర‌త్ బాబుతో న‌మిత పెళ్ళి అంటూ వార్త‌లు…వ‌ర‌స్ట్ అంటూ న‌మిత భ‌ర్త అస‌హ‌నం..!

by AJAY
Ads

సొంతం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ నమిత. తెలుగుతోపాటు తమిళంలోనూ నమిత స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ పక్కన జెమిని అనే సినిమాలో నటించింది. అంతేకాకుండా ర‌వితేజ హీరోగా నటించిన ఒక రాజు ఒక రాణి సినిమా ద్వారా న‌మిత‌ తెలుగు ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. నమిత కు ముందు నుంచి గ్లామర్ బ్యూటీ గా పేరు వచ్చింది. బాల‌య్య‌తో సింహ‌మంటి కుర్రాడే వేట‌క‌చ్చాడు అంటూ స్టెప్పులు వేసి ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించింది ఈ చ‌బ్బీ బ్యూటీ.

namitha husband on sharath babu

హీరోయిన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నమితను కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. నమిత సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ బాబు తో డేటింగ్ చేస్తోంద‌ని..వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా వార్త‌లు వ‌చ్చిన స‌మ‌యంలోనే న‌మిత వీరేంద్ర‌ను వివాహం చేసుకుంది. న‌మిత వీరేంద్ర‌ల వివాహం స‌మయంలో న‌మ‌త శ‌ర‌త్ బాబుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు రావ‌డం క‌ల‌క‌లం రేపాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తల పై నమిత భర్త వీరేంద్ర స్పందించాడు.

namitha husband on sharath babu

సరిగ్గా త‌మ‌ పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్ బాబు తో నమిత పెళ్లి అంటూ వార్తలు వచ్చాయని తెలిపాడు. జీవితంలో తాను విన్న వరస్ట్ కామెంట్స్ అంటూ వీరేంద్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదని వీరేంద్ర‌ అన్నారు. శరత్ బాబు చాలా పెద్ద మ‌నిషి అని అలాంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా తప్పు అన్నారు. అలాంటి వార్త‌ల‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వీరేంద్ర వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా నమిత సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా ఇటీవల సొంతంగా ఒక ఓటీటీని కూడా ప్రారంభించింది.


You may also like