Home » జంటలతో టీఆర్పీ…ఢీ 14 ఎంట్రీతో కొనసాగనున్న లవ్ ట్రాక్…!

జంటలతో టీఆర్పీ…ఢీ 14 ఎంట్రీతో కొనసాగనున్న లవ్ ట్రాక్…!

by AJAY
Ad

ప్రస్తుతం దాదాపు ప్రతి టీవీ షోలలోను లవ్ ట్రాక్ లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ లవ్ ట్రాక్ లేకపోయినా స్క్రిప్టు రాసి మరీ ప్రేమను పూట్టిస్తు ట్రాక్ నడిపిస్తున్నారు. దాదాపు అన్ని ఎంటర్టైనింగ్ ఛానళ్లలో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కామెడీ షో… డాన్స్ షో అనే తేడా లేకుండా లవ్ ట్రాక్ లు నడిపిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఓ కామెడీ షో లో ప్రముఖ యాంకర్ తో కంట్స్తెంట్ కు లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. అదేవిధంగా గతంలో యాంకర్ రష్మీ జబర్దస్త్ టీం లో ఉన్న సుధీర్ ర్ ల మధ్య కూడా ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఢీ షోలోనూ అదే కనిపిస్తుంది.

Advertisement

Sai nainika

ఢీ పదమూడవ సీజన్ లో డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక… సాయి ల మధ్య లవ్ ట్రాక్ కనిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా స్టేజి పైనే అనేకసార్లు వీరిద్దరూ ప్రపోజ్ లు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు బుల్లితెరపై భలే క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఢీ 13వ సీజన్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢీ 14వ సీజన్ ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ లో నైనిక… సాయి లకు అవకాశం కూడా కల్పించారు.

Advertisement

ఢీ13 లో వీరిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు షోకు ఆకర్షితులయ్యారు. వీరిద్దరి పాటలు…సీన్ లకు యూట్యూబ్ లో తెగ క్రేజ్ వచ్చింది. దాంతో టిఆర్పీ కోసమే ఢీ 14వ సీజన్ లోనూ మళ్లీ వీరిద్దరిని తీసుకున్నట్టు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఢీ 14వ సీజన్ లో అవకాశం రావడంతో ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టారు. మరి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట ఢీ14 సీజన్ లో ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading