Home » పొన్నియ‌న్ సెల్వ‌న్ నెగిటివ్ ట‌క్ కు ఈ 10 కార‌ణాలు ఇవేనట‌..? లేదంటే మ‌రో బాహుబ‌లి అయ్యేదా..?

పొన్నియ‌న్ సెల్వ‌న్ నెగిటివ్ ట‌క్ కు ఈ 10 కార‌ణాలు ఇవేనట‌..? లేదంటే మ‌రో బాహుబ‌లి అయ్యేదా..?

by AJAY
Ad

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్, కార్తీ, జ‌యం ర‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్. ఈ సినిమా గురువారం పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నెగిటివ్ టాక్ కు కొన్ని కార‌ణాలు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప‌ది విష‌యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….బాహుబ‌లి సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. అదే రేంజ్ లో పొన్నియ‌న్ సెల్వ‌న్ ఉంటుంద‌ని ప్రేక్షకులు ఊహించుకున్నారు.

Advertisement

కానీ పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా ప్ర‌మోషన్స్ చేయ‌డంలో మాత్రం చిత్ర‌యూనిట్ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ఆ కార‌ణం వ‌ల్ల సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌లేదు. ఇక తెలుగు సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో కార్తీ ఆల్రెడీ ఓ బాహుబ‌లి ఉంది మ‌రో బాహుబ‌లి వ‌ద్దు. అంటూ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ తెలుగు ప్రేక్ష‌కులకు న‌చ్చలేదు. దాంతో చాలా మందికి సినిమాపై నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది.

Advertisement

క‌ల్కిర‌చించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ పుస్త‌కం ఆధారంగా సినిమాను తెరక్కించారు. అది పూర్తిగా చోళుల క‌థ‌..అయితే చోళుల గురించి ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు సినిమా ఎక్కలేదు. చ‌రిత్ర‌ను అర్థం అయ్యేలా చెప్ప‌గ‌ల‌గాలి…ఇలాంటి సినిమాలో ఎలివేష‌న్స్ ఉంటేనే ప్రేక్ష‌కుడికి ఆస‌క్తి క‌లుగుతుంది. కానీ సినిమాలో అలా చేయ‌లేదు. అంతే కాకుండా సినిమాలో చాలా పాత్ర‌లు వ‌స్తాయికానీ వాటికి స‌రైన ప‌రిచ‌యం ఉండ‌దు. అది కూడా ఈ సినిమాకు మైన‌స్ అయ్యింది.

mani ratnam

mani ratnam

విక్ర‌మ్ పాత్ర సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ కానీ అది కొన్ని సీన్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. జ‌యం రవి పాత్ర చాలా బాగుంటుంది కానీ ఆయ‌న‌ది గెస్ట్ రోల్ మాదిరిగా క‌నిపిస్తుంది. సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్ లు చాలానే ఉన్నాయి కానీ ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఒక్క‌టి లేదు. సినిమాలోని పాట‌లు పెద్దగా ఆక‌ట్టుకోలేదు. అంతే కాకుండా సంధ‌ర్బానికి త‌గిన‌ట్టుగా ఒక్క పాట కూడా రాలేదు. సినిమాలో మ‌ణిరత్నం మార్క్ మిస్ అయ్యింది. అంతేకాకుండా పూర్తిగా టెక్నిక‌ల్ వ‌ర్క్ పై ఆధార‌ప‌డిన‌ట్టు అనిపిస్తుంది.

Visitors Are Also Reading