Home » అంగరంగ వైభవంగా నాగశౌర్య వివాహం.. లుక్ అదిరిపోలా..!!

అంగరంగ వైభవంగా నాగశౌర్య వివాహం.. లుక్ అదిరిపోలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హోదాని సంపాదించుకునే స్థాయికి వస్తున్నారు. అలాంటి నాగశౌర్య పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ యంగ్ హీరో తను ప్రేమించిన అనూష శెట్టిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహమాడారు..

Advertisement

also read:చిరు,బాలయ్య మధ్యలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పుకోండి..!!

మరి ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..యంగ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్ 20 తేదీన బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో వీరి వివాహం జరిగింది. శౌర్య కి కాబోయే భార్య పేరు అనూష శెట్టి. ఈమె ఇంటీరియర్ డిజైనర్. సౌర్య పెళ్లి సందడి ఆల్రెడీ మొదలైంది. హైదరాబాదులో శౌర్య పెళ్లి సెలబ్రేషన్స్ పెళ్ళికొడుకుని చేయడం నుంచి మొaదలైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం బెంగళూరులో పెళ్లి జరుగుతోంది. ఈ ఫోటోల్లో శౌర్య మరియు అనూష శెట్టి అదిరిపోయే లుక్ లో ఉన్నారు.. వీరి పెళ్లిని తిలకించడం కోసం కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు, విఐపిలు కూడా వస్తున్నారు. సెలబ్రిటీ వివాహం కాబట్టి చాలామంది సెలబ్రిటీలు అక్కడికి హాజరవ్వడంతో పెళ్లి వేడుక అంతా సందడి సందడిగా మారిపోయింది. ఏది ఏమైనా నాగశౌర్య తను అనుకున్న పని చేసేసాడు. తను ప్రేమించిన అమ్మాయిని వివాహం ద్వారా తన భార్యను చేసుకున్నాడు. ఈ నూతన వధూవరులు కలకాలం ఆనందంగా ఉండాలని దీవిద్దాం.. మరి ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చూసేద్దాం..

also read:

Visitors Are Also Reading