Home » రోడ్డు పై లవర్ ను కొట్టిన ప్రియుడు…. స్వారీ చెప్పాలంటూ నాగశౌర్య సీరియస్…!

రోడ్డు పై లవర్ ను కొట్టిన ప్రియుడు…. స్వారీ చెప్పాలంటూ నాగశౌర్య సీరియస్…!

by AJAY
Ad

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో నాగశౌర్య. మొదటి సినిమా తోనే ఈ హీరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తరవాత ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఛలో సినిమా తర్వాత నాగశౌర్య తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఛలో తో పాటు మరికొన్ని ప్రేమకథలలో నటించడం తో నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

Advertisement

ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ నాగశౌర్య ఓకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చున్నాడు.ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కూడా అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా నాగశౌర్య ఓ లవర్స్ పంచాయితీ లో తలదూర్చాడు. నాగశౌర్య కార్ లో వెళుతున్న సమయం లో ఇద్దరు లవర్స్ రోడ్డు పై గొడవ పడుతున్నారు.

Advertisement

ఆ గొడవలో ప్రియుడు తన ప్రేయసిని కొట్టాడు. ఆ ఘటన చూసిన నాగశౌర్య కోపం తో ఊగిపోయాడు. అమ్మాయిని రోడ్డు పై కొడతావా స్వారీ చెప్పు అంటూ గొడవ పడ్డాడు. అయినప్పటికీ నా లవర్ బయ్యా అంటూ యువకుడు పక్కకు తప్పుకున్నాడు. ఇక లవర్ కూడా ఆ యువకుడికే సపోర్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా నెటిజన్లు నాగ శౌర్య చేసునపనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading