Home » ఘోస్ట్‌ గా నాగార్జున వచ్చేది ఎప్పుడు..?

ఘోస్ట్‌ గా నాగార్జున వచ్చేది ఎప్పుడు..?

by Azhar
Ad

ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు కూడా వారు సమానంగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే యోంగ్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు.. కానీ సీనియర్ హీరోలు మాత్రం సూపర్ స్పీడ్ లో సినిమాలు చేసి విడుదల చేస్తున్నారు. అందులో అక్కినేని హీరో నాగార్జున కూడా ఒక్కడు. నాగార్జున ఈ మధ్యే వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చాడు.

Advertisement

అయితే ఆ సినిమా నాగార్జునకు అనుకునేంత సక్సెస్ అయితే ఇవ్వలేదు. ఇక నాగార్జున చేస్తున్న తాజాగా సినిమాలో ది ఘోస్ట్‌ సినిమా ఒక్కటి. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కు ఎప్పటి నుండో అప్డేట్ అనేది లేదు. ఒక్క ఫస్ట్ లుక్ అనేది విడుదల చేసి వదిలేసారు. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల చేయాల్సి ఉన్న కరోనా కారణంగా షూటింగ్ అనేది ఆలస్యం అయ్యింది.

Advertisement

అలాగే సినిమాలో హీరోయిన్ ఐన కాజల్ ప్రెగ్నెన్సీతో సినిమా నుండి తప్పుకోవడంతో… రీ శహోట్ అనేది చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ అందరికి ది ఘోస్ట్‌ టీం అనేది గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా షూటింగ్ అనేది ఈరోజుతో ముగిసింది అని ప్రకటించింది చిత్ర బృందం. కానీ ఎప్పుడు విడుదల చేయనున్నారు అనేది చెప్పలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా తర్వాత విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ కు బుమ్రా కూడా మిస్..!

ఫైనల్ లో ఆస్ట్రేలియా చీటింగ్..! 

Visitors Are Also Reading