Home » అఖిల్ పాన్ ఇండియా సినిమా కోసం నాగార్జున ప్లాన్స్..!

అఖిల్ పాన్ ఇండియా సినిమా కోసం నాగార్జున ప్లాన్స్..!

by Azhar
Ad

అక్కినేని కుటుంబం నుండి నాగార్జున కొడుకుగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే అఖిల్ సినిమాల్లోకి వేసిన చాలా కాలం అవుతున్న చేసిన సినిమాలు తక్కువే. ఇక ఆ సినిమాలు కూడా ప్లాప్ అనే విషయం అంధారికి తెలిసిందే. అందుకే హీరోగా తన మొదటి హిట్ కోసం అఖిల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఎంజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement

అయితే ఈ మధ్య మన తెలుగులో ఉన్న పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నాగార్జున కూడా అఖిల్ పాన్ ఇండియా సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ ను నాగార్జున కలిశాడట. అయితే కరణ్ పనే సినిమా సెలబ్రెటీల పిల్లలను సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించడం.

Advertisement

ఇప్పటివరకు ఎందరో బాలీవుడ్ స్టార్స్ యొక్క పిల్లలను కరణ్ లాంచ్ చేసాడు. అందుకే తన కొడుకు సినిమాను కూడా హిందీలో ప్లాన్ చేయాలి అనే ప్లాన్ తో నాగార్జున తాజాగా కరణ్ జోహార్ ను కలిసినట్లు తెలుస్తుంది. అయితే వీరి మీటింగ్ లో ఏం జరిగిందో అయితే తెలియదు కానీ.. ఇప్పటివరకు తెలుగులోనే మొదటి హిట్ అనేది అందుకొని అఖిల్ హిందీలో ఏం చేస్తాడు అనే అనుమానాలను సినీ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

భువీపై రోహిత్ కు నమ్మకం లేదు.. అందుకే విఫలం..?

బుమ్రా మళ్ళీ లేనట్లే.. చెప్పేసిన పాండ్య..!

Visitors Are Also Reading