Home » Nagarjuna – Lakshmi : నాగార్జున-లక్ష్మీల అలనాటి ఫోటో వైరల్…!

Nagarjuna – Lakshmi : నాగార్జున-లక్ష్మీల అలనాటి ఫోటో వైరల్…!

by Bunty
Ad

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో భార్య అమల గురించి చాలామందికి తెలుసు. కానీ నాగార్జున మొదటి భార్య నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంతే కాకుండా దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున ఎందుకు విడిపోయారు అన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు. దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుండే అమెరికాలో పెరగటంతో పాటు అక్కడే చదువుకున్నారు. అయితే దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావుతో మంచి అనుబంధం ఏర్పడింది.

READ ALSO :  TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

Advertisement

Advertisement

ఆ తర్వాత వీరిద్దరూ వియ్యంకులు కూడా అవ్వాలనుకున్నారు. దాంతో నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగానే అతడికి లక్ష్మీని వివాహం చేయాలని రామానాయుడు నిశ్చయించుకున్నారు. అమెరికాలో పెరిగిన లక్ష్మీ అక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు. కానీ ఆమెను ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరి వివాహం జరిపించారు. వివాహం తర్వాత నాగార్జున లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించారు. పెళ్లి తర్వాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట.

READ ALSO : Romancham OTT : తెలుగులో బంపర్ హిట్ ‘రోమాంచం’ హారర్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

దాంతో అమెరికాకు వెళదామని, అక్కడే స్థిర పడదామని నాగార్జునతో చెప్పారట. అయితే నాగార్జున హీరోగా సినిమాల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడటానికి ఇష్టపడలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం నాగార్జున-లక్ష్మీల వింటేజ్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో నాగ్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు.

READ ALSO :  విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

Visitors Are Also Reading