Home » స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల‌పై మ‌రోసారి స్పందించిన నాగార్జున‌…చై హ్యాపీ అంటూ షాకింగ్ కామెంట్స్..!

స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల‌పై మ‌రోసారి స్పందించిన నాగార్జున‌…చై హ్యాపీ అంటూ షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీఫుల్ క‌పుల్ స‌మంత నాగ‌చైత‌న్య గ‌తేడాది విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి విడాకుల వార్త అభిమానుల‌ను ఏంత‌గానో బాధించింది. చూడ్డానికి చిల‌కాగోరింక‌ల్లా క‌నిపించే చైసామ్ విడిపోవ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. అంతే కాకుండా ప్రేమించి ఆ త‌ర‌వాత కొన్నేళ్ల పాటూ డేటింగ్ లో ఉండి మ‌రీ విడిపోవ‌డం సినీప్రేక్ష‌కులంద‌రికీ షాక్ ఇచ్చింది.

ఇక చైసామ్ విడిపోయి యేడాది అవుతున్నా వారి విడాకుల గురించి ఏదో ఒక వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. వీరిద్ద‌రూ ఎందుకు విడాకులు తీసుకున్నారో కార‌ణం తెలియ‌క‌పోవ‌డంతో మీడియాలో వార్త ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది. చాలా సార్లు విడాకుల త‌ర‌వాత స‌మంత కు మ‌రియు నాగ‌చైత‌న్య‌కు విడాకుల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. వాళ్లు ఆ ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేస్తూ ఏదో ఒక స‌మాధానం ఇచ్చారు.

Advertisement

Advertisement

ఇక చైతూ తండ్రి నాగార్జున‌ను సైతం చైసామ్ విడాకుల ప్ర‌శ్న‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదివ‌ర‌కే ఓసారి స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల పై నాగార్జున స్పందిచిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా మ‌రోసారి నాగార్జున బ్ర‌హ్మాస్త్ర సినిమా ప్ర‌మోష‌న్స్ లో అలాంటి ప్ర‌శ్న‌ల‌ను ఎదురుకున్నారు. నాగ‌చైత‌న్య ప్రొషెష‌న‌ల్ లైఫ్ కంటే ప‌ర్స‌న‌ల్ లైఫ్ పైనే ఎక్కువ వార్త‌లు వ‌స్తున్నాయి తండ్రిగా మిమ్మ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తుందా అంటూ యాకంర్ ప్ర‌శ్నించారు.

దానికి నాగ్ స‌మాధానం ఇస్తూ….నాగ‌చైత‌న్య సంతోషంగా ఉన్నాడు నాకు అది చాలు. జీవితంలో అది ఒక అనుభ‌వం. విడాకులు అనేవి దుర‌ద్రుష్ట‌క‌రం కానీ దాని గురించి మేము అలోచిస్తూ కూర్చోలేము. అది జ‌రిగింది మా జీవితాల నుండి వెళ్లిపోయింది. ఎవ‌రి జీవితంలో ఇలా జ‌రిగినా దాని నుండి బ‌య‌ట ప‌డాలి. అంటూ నాగ్ కామెంట్స్ చేశారు. ఇక నాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading