Home » Thank you movie review : “థాంక్యూ” సినిమా రివ్యూ & రేటింగ్..!

Thank you movie review : “థాంక్యూ” సినిమా రివ్యూ & రేటింగ్..!

by AJAY
Ad

పరిచయం: 

అక్కినేని హీరో నాగచైతన్య బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాల విజయంతో జోష్ మీద ఉన్నాడు. ఇక రీసెంట్ గా నాగచైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంచనాలను రీచ్ అయిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

Advertisement


కథ &కథాంశం :

ఈ సినిమా చాలా సింపుల్ కథతో తెరకెక్కింది. నారాయణపురం అనే గ్రామంలో చదువుకున్న ఓ కుర్రాడు నాగచైతన్య అభిరామ్ ఉన్నత చదువులు చదివి విదేశాల్లో సెటిల్ అవుతాడు. బిలినియర్ స్థాయికి ఎదిగిన అభిరామ్ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి జీవితంలో సహాయపడిన వాళ్లందరికీ థాంక్యూ చెప్పాలని భావిస్తాడు. అంతేకాకుండా నాగచైతన్య జీవితంలో మొత్తం ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. ఆ ముగ్గురు అమ్మాయిలతో నాగచైతన్య ప్రేమాయణం ఎలా ఉంది..? ఎందుకు విడిపోవలసి వచ్చింది..? నాగచైతన్య జీవితంలో బిలినియర్ స్థాయికి ఎదగడానికి ఎవరెవరు సాయపడ్డారు. వాళ్లకు ఎలా థాంక్యూ చెప్పాడు అనేదే ఈ సినిమా కథ.

Advertisement


విశేషణ :

నాగచైతన్య ఇదివరకే ప్రేమమ్ అనే సినిమాలో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ లో నటించాడు. ఇక అలాంటి కాన్సెప్ట్ తోనే థాంక్యూ సినిమా కూడా రావడంతో ముందునుండి ఈ సినిమాపై అనుమానాలు ఉన్నాయి. సినిమా కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ అవ్వలేకపోయారు. రొటీన్ కథ తో వచ్చినప్పటికీ గత సినిమాలతో పోలిస్తే నాగచైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వేరియేషన్స్ లోనూ చైతూ నటనతో మెప్పించగలిగాడు. సినిమాలో హీరోయిన్ లుగా నటించిన అవిక గోర్, మాళవిక నాయర్, రాశీ కన్నాలు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్స్ కు తగినట్టుగా రావడం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ విక్రమ్ కే కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో నెట్టుకువచ్చాడు. సినిమా మొత్తం లో చైతు మాళవికల లవ్ స్టోరీ ఆకట్టుకుంది. కొన్ని సీన్లలో మాత్రం పూర్తి రొటీన్ గా అన్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే థాంక్యూ సినిమాని ఒకసారి థియేటర్లలో చూడవచ్చు.

Visitors Are Also Reading