Home » చైతూకు అఖిల్ తో పాటూ మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా…?

చైతూకు అఖిల్ తో పాటూ మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా…?

by Ajay

అక్కినేని వారసుడు నాగచైతన్య కు ఎంతమంది తమ్ముళ్లు అంటే టక్కున ఒక్కరే అని సమాధానం వస్తుంది. అది కూడా అఖిల్ అని చెబుతారు. అయితే చైతూ కు మరో తమ్ముడు కూడా ఉన్నాడు అన్నది అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును చైతూ కు మరో తమ్ముడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు చైతూ తల్లి రెండో కుమారుడే చైతూ మరో తమ్ముడు. మొదట నాగార్జున కు విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మి తో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

Nagachithanya family

అయితే నాగ చైతన్య పుట్టిన తరవాత కొంత కాలానికే నాగ్ లక్ష్మి జంటకు విడాకులు అయ్యాయి. ఆ తరవాత లక్ష్మి మరో వివాహం చేసుకుంది. అనంతరం నాగార్జున కూడా అమలను వివాహం చేసుకున్నాడు. ఇక విడాకుల తరవాత నాగ చైతన్య భాద్యతను నాగ్ తో పాటు అతడి తల్లి కూడా తీసుకుంది. చైతూ నాగార్జున వద్ద ఉన్నా లేదంటే చెన్నై లో ఉన్నా అతడి గురించి పట్టించుకునేది. అంతే కాకుండా నాగ చైతన్య పెళ్లికి తన భర్త తో కలిసి వచ్చి ఆశీర్వదించింది.

Also Read: విజ‌య‌నిర్మ‌ల మొద‌టి భ‌ర్త గురించి మీకు తెలుసా?

ఇక ఈ పెళ్లికి చైతూ తమ్ముడు లక్ష్మి రెండో కుమారుడు కూడా వచ్చాడు. అంతే కాకుండా అతడి పెళ్లికి కూడా చైతూ వెళ్లి సందడి చేశాడట. ఇక సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అతడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

ఇక సమంత కూడా ఓ ఇంటర్వ్యూలో చైతూ తల్లి లక్ష్మీ పై పొగడ్తలు కురిపించింది. ఇది ఇలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతూ ప్రస్తుతం థాంక్ యూ… బంగార్రాజు అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు.

Also Read: ద‌ర్శ‌కుల‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా..?


You may also like