Home » Naga Chaitanya: వెంకటేష్ రిజెక్ట్ చేసిన సినిమాలో నాగచైతన్య….!

Naga Chaitanya: వెంకటేష్ రిజెక్ట్ చేసిన సినిమాలో నాగచైతన్య….!

by AJAY
Published: Last Updated on
Ad

పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాకే తరుణ్ భాస్కర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకోవడం తో పాటు ఎన్నో అవార్డులను సైతం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ నటుడిగానూ నటించి నిరూపించుకున్నారు. అంతేకాకుండా టీవీ షోలలోనూ తరుణ్ భాస్కర్ సందడి చేస్తున్నారు.

VENKATESH

VENKATESH

ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ దర్శకుడు కాబట్టి ప్రస్తుతం మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. పెళ్లిచూపులు సినిమాను ప్రమోట్ చేసిన సురేష్ ప్రొడక్షన్ తోనే తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేయబోతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ తదుపరి సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ ను వెంకటేష్ రిజెక్ట్ చేశారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.

Advertisement

Advertisement

Also Read: నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

దాంతో అదే స్క్రిప్ట్ తరుణ్ భాస్కర్ నాగచైతన్యకు వినిపించినట్టు గా సమాచారం. కథ నచ్చడంతో నాగచైతన్య కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి ఈ కథను అందించారు. విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా రాశికన్నా నటిస్తోంది. అవికాగోర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading