Home » మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

by Anji
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ వైపు రాజ‌కీయాలు మ‌రొక‌వైపు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ ప‌వ‌న్ రోజు రోజుకూ మ‌రింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడ‌గ‌ట్టుకుంటున్నారు. మొన్న జ‌రిగిన ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌ను చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మవుతోంది. మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఇప్ప‌టంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇసుక వేస్తే రాల‌నంత మంది జ‌న‌సైనికులు పోటెత్తారు.

Advertisement

Advertisement

ఇక ఈ కార్య‌క్ర‌మంలో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా పాల్గొన్నారు. నాగ‌బాబు జ‌న‌సేన పార్టీలో పీఏసీ స‌భ్యుడిగా ఉన్న విష‌యం తెలిసిన‌దే. బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్‌, నాగ‌బాబు ఇచ్చిన ప్ర‌సంగం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా.. నాగ‌బాబు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు స‌పోర్టు చేసినందుఉ ప్రేమ‌ను కురిపించ‌నందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు నాగ‌బాబు. పార‌ద‌ర్శ‌క‌మైన అవినీతి ర‌హిత పాల‌న కోసం మెరుగైన‌, ధైర్య‌మైన రేప‌టి కోసం మా ప్ర‌యాణానికి ఆజ్యం పోసేలా మీరు చూపించిన ప్రేమ‌కు, మ‌ద్ద‌తు ధ‌న్య‌వాదాలు మ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్ కల్యాణ్ అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read :  శ్రీ‌శైలంలో 30 నుంచి ఉగాది మ‌హోత్స‌వాలు

Visitors Are Also Reading