మెగా బ్రదర్స్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే వ్యక్తి నాగబాబు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ రేంజ్ లో నాగబాబు సక్సెస్ ను అందుకోలేకపోయారు. కానీ బుల్లితెరపై జడ్జిగా నాగబాబు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ ద్వారా నాగబాబుకు చాలామంది అభిమానులు అయ్యారు. నాగబాబు ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు. ఇక నాగబాబు తన సోదరుల జోలికి ఎవరు వచ్చినా వారిపై సెటైర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజాగా సోషల్ మీడియా ద్వారా నాగబాబు అదే పని చేశారు… వివరాల్లోకి వెళితే….బిజెపి నేత..గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆయన ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Also Read: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై వేణుస్వామి ఏమన్నారో తెలుసా ?
Advertisement
అయితే ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగిస్తూ ఉండగా చిరంజీవితో లేడీ అభిమానులు ఫోటోలు దిగుతున్నారు. దాంతో గరికపాటి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. చిరంజీవి గారు మీరు ఫోటో సెషన్ ఆపేస్తే నేను మాట్లాడుతాను అని చెప్పారు. లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మెగాస్టార్ అభిమానులు గరికపాటి పై ఫైర్ అయ్యారు. ఇక ఇదే ఇష్యూ పై నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఇన్ డైరెక్ట్ గా ప్రాసను ఉపయోగిస్తూ నాగబాబు గరికపాటి పై సెటైర్ లు వేసారు. ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటి. అంటూ నాగబాబు తన ట్వీట్ లో రాసుకువచ్చారు. నాగబాబు ట్వీట్ చూసి కొంతమంది…. నీకు అవసరమా నాగబాబు అని స్పందిస్తుంటే.. మరి కొంతమంది ఆయన ట్వీట్ కు సపోర్ట్ చేస్తున్నారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
Advertisement
Also Read: ‘ భైరవద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్, రజనీకాంత్, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?