మెగా బ్రదర్ నాగబాబు ఓ వైపు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో నాగబాబు జనసేన నుండి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. అయినప్పటికీ నాగబాబు ఏపీలో సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. తాజాగా నాగబాబు వైసిపి సర్కార్ ను డిమాండ్ చేశారు.
Advertisement
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 29 మంది కౌలు రైతులను గుర్తించి వారి కుటుంబాలకు పవన్ కల్యాణ్ 1 లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ విషయంపైనే నాగబాబు స్పందించారు. తాము అనంతపురం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 29 మంది కౌలు రైతులను గుర్తించి వారికి కుటుంబాలకు లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Advertisement
ఈ విధంగా ఐదుగురు కౌలు రైతుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇచ్చినట్లు తెలిపారు. సమయం లేకపోవడంతో మిగిలిన ఇరవై నాలుగు మంది కౌలుల రైతు కుటుంబాలకు దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్లి సభను నిర్వహించి అక్కడే వారికి డబ్బులు అందజేసినట్లు తెలిపారు.
అయితే మొదట తాము ఏ ఐదు కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చామో ఆ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఏడు లక్షల పరిహారం చెల్లించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం న్యాయపరంగా ఇరవై నాలుగు కుటుంబాలకు కూడా ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేయాలని జనసేన తరఫున, ఆ కుటుంబాల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.