టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఏమాయచేశావే సినిమా ద్వారా పరిచయం అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య. ఆ తరువాత వీరు విడాకులు తీసుకున్నారు.
Advertisement
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వాళ్ళ విడాకుల గురించే చర్చ కొనసాగుతూనే ఉంది. వీరు విడాకులు తీసుకోవడానికి అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది నెటిజన్స్ వారికి వారే చర్చించుకుంటున్నారు. అంత గాఢంగా ప్రేమించుకుని కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత సంతోషంగా పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతుందని అసలు ఎవరు కూడా కలగనలేదు.
Advertisement
పెళ్లి అయిన కొన్నేళ్లకే వీరు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా సమంతకు విడాకులు ఎందుకు ఇచ్చాడో చెప్పేశాడు నాగచైతన్య. ఇటీవలే నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.. సమంతతో విడాకులు తీసుకున్నది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లనే అంటూ అసలు నిజం చెప్పేశాడు. మీరేమైనా చిన్న పిల్లల సోషల్ మీడియాలో పుకార్లు వస్తే విడాకులు తీసుకుంటారా ? ఇంత కన్న ఘోరం ఇంకొకటి ఉండదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా సమంత నటించిన మీకు ఇష్టమైన సినిమాలు ఏవి అని ప్రశ్నించగా.. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్, మజిలీ, శాకుంతలం, ఏమాయచేశావే అంటూ సమాధానం చెప్పాడు నాగ చైతన్య. సోషల్ మీడియాలో నాగచైతన్య చెప్పిన సమాధానం తెగ వైరల్ అవుతోంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. మరో హిట్ కొట్టాలని ఫిక్స్ !
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు