Telugu News » Blog » పాన్ ఇండియా సినిమా అందుకే చేయడం లేదు..!

పాన్ ఇండియా సినిమా అందుకే చేయడం లేదు..!

by Manohar Reddy Mano
Ads

అక్కినేని కుటుంబం నుండి నాగార్జున తరవత వచ్చిన హీరోలలో అతని కొడుకు అక్కినేని నాగ చైతన్య ఒక్కడే ఇప్పుడు టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు అని చెప్పాలి. ఇక అఖిల్ ఇంకా హీరోగా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే 2011 లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చాడు నాగ చైతన్య. ఇక ఈ మధ్యే నాగ చైతన్య యొక్క థాంక్యూ సినిమా విడుదల అయ్యింది కానీ జనాలను మెప్పించలేకపోయింది.

అయితే ఈ నెల 11న ఆమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అనేది అవుతుంది. అందువల్ల తెలుగు ప్రమోషన్స్ లో నాగ చైతన్య ఎక్కువగా పాల్గొంటున్నాడు. ఇక అలాంటి ఓ ఇంటర్వ్యూలోనే మీరు ఇప్పటివరకు ఎందుకు హిందీ సినిమా అనేది చేయలేదు అనే ప్రశ్న నాగ చైతన్యకు ఎదురయ్యింది.

ఇక ఆ ప్రశ్నకు సమాధానము ఇస్తూ నాగ చైతన్య.. నేను చెన్నైలో పుట్టాను. మొత్తం హైదరాబాద్ లోనే పెరిగాను. అందుకే నాకు హిందీ అనేది అంతగా బాగా రాదు. ఈ ఒక్క కారణంగానే నేను హిందీలో సినిమాలు చేయడం లేదు. ఈ కారణంతోనే గతంలో అక్కడ వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నాను అని నాగ చైతన్య పేర్కొన్నాడు. ఇక నేను లాల్ సింగ్ చద్దా సినిమాకు కూడా మొదట ఒప్పుకోలేదు అని.. కానీ ఇందులో నా పాత్ర అనేది సౌత్ నుండి వచ్చిన కుర్రాడిగా ఉండటంతో అంగీకరించాను అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

బేర్ గిల్స్‌ తో విరాట్ కోహ్లీ…?

టీం ఇండియా ఎంట్రీ కోసం పృథ్వీ షా ప్రయత్నాలు..!


You may also like