Home » సమంతతో మళ్ళీ సినిమా చేయడం పై చైతు షాకింగ్ రియాక్షన్…?

సమంతతో మళ్ళీ సినిమా చేయడం పై చైతు షాకింగ్ రియాక్షన్…?

by Azhar
Ad
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత పేర్లు అనేవి రోజు చర్చల్లో ఉంటున్నాయి. కానీ అందుకు కారణం వారు చేస్తున్న సినిమాలు కాదు. వారు విడిపోవడం. అయితే చాలా కాలం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట గత ఏడాదిలో విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు కూడా వీరి పైన ఏదో ఒక్క వార్త అనేది వస్తూనే ఉంది. అయితే ఈ మధ్య వీరు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఒక్కరి గురించి మరొకరికి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
అయితే ఈ మధ్యే చైతన్య కూడా నా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది సమంతతో బాగుటుంది అని వ్యాఖ్యలు చేసాడు. అప్పటి నుండి వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమాలో నటించాలి అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించాడు. మొదట ఏం మాయచేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ ఇలా నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇందులో ఒక్క ఆటోనగర్ సూర్య సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.
అందుకే వీరు మళ్ళీ కలిసి నటిస్తే బాగుంటుంది అనే వాదన వస్తున్న తరుణంలో అది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ తాజాగా ఇదే ప్రశ్న నాగ చైతన్య ముందుకు వచ్చింది. మీరు మళ్ళీ సమంతతో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నేను , సమంత కలిసి ఇప్పుడు సినిమా చేస్తే అది చాలా క్రేజీగా ఉంటది అంటూ పాజిటివ్ గా చెప్పాడు. కాబట్టి సమంతతో కలిసి చేయడానికి నాగ చైతన్యకు ఏ సమస్య లేదు అని అర్ధం అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading