Home » నాగ చైతన్య బాలీవుడ్ సినిమా సిద్ధం..!

నాగ చైతన్య బాలీవుడ్ సినిమా సిద్ధం..!

by Azhar
Ad

ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబం నుండి నాగార్జున తర్వాత వచ్చిన హీరోలలో ఆయన కొడుకుగా వచ్చిన నాగ చైతన్య ఒక్కడే సక్సెస్ అయ్యాడు. ఇక అఖిల్ ఇప్పుడు తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటె.. ఇప్పుడు తెలుగులో హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలనీ చూస్తున్నారు. ప్రభాస్, తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే హిందీలో తమ సినిమాలు విడుదల చేయగా.. మహేష్ బాబు ఇప్పుడు అదే పనిలో ఉండగా.. నాగ చైతన్య కూడా అదే దారిలో వెళ్తున్నాడు.

Advertisement

అయితే ప్రస్తుతం నాగ చైతన్య హిందీలో అమిర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇందులో అమీర్ హీరో కాగా.. నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో మాత్రమే నటిస్తున్నాడు. కానీ ఇప్పుడు నాగ చైతన్య థానే సోలో హీరోగా హిందీలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను స్వయంగా అమీర్ ఖాన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా సమయంలో అమీర్ అలాగే చైతన్య మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడినట్లు తెలుస్తుంది.

Advertisement

అందుకే నాగ చైతన్య హీరోగా తెలుగులో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా అమీర్ వచ్చాడు. అందువల్లే ఇప్పుడు నాగ చైతన్య హిందీలో హీరోగా లంచ్ చేయాలనీ అమీర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పటికే నాగ చైతన్య కోసం కథను కూడా వెతకడం ప్రారంభించాడట అమీర్. అయితే ఈ సినిమా అనేది యాక్షన్ కాకుండా కేవలం లవ్ స్టోరీగా మాత్రమే ఉండాలని అమీర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన అనేది రాలేదు. ఇక ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య నటించిన థాంక్యూ అనే సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి :

పంత్ అనవసరంగా ఆ పని చేసాడు అంటున్న సెహ్వాగ్…!

గురువుకి వైన్ దక్షిణ ఇచ్చిన పంత్..!

Visitors Are Also Reading