Telugu News » Blog » బట్టలు ఉండవు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య..!

బట్టలు ఉండవు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య..!

by Manohar Reddy Mano
Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య – సమంత ఏం మాట్లాడిన అది వైరల్ గా మారుతుంది. వీరిద్దరూ గత ఏడాది విడాకులు తీసుకున్న తర్వాత నుండి ఈ ఏడాది వరకు మంచిగానే ఉన్న.. ఇప్పుడు మాత్రం ఇద్దరు మీద వస్తున్న పుకార్లు.. ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అనేది విబేధాలకు దారి తీస్తుంది. ఇక ఈ మధ్యే సమంత కూడా ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ పై గట్టిగానే రిప్లై ఇచ్చింది. అదలా ఉంటె.. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.

అయితే ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి ఎక్కువ చేసారు. సినిమా నుండి ఏదో ఒక్క అప్డేట్ అనేది ఇస్తూ వస్తున్నారు. అలాగే నాగ చైతన్య, రాశి ఖన్నా కూడా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాంటి ఓ ఇంటర్వ్యూలోనే చైతన్య కొంచెం బోల్డ్ కామెంట్స్ చేసాడు. మాములుగా చైతన్య అంటే మంచి బాలుడు అనే ఇమేజ్ మన టాలీవుడ్ లో ఉంది. కానీ అలాంటి చైతన్య ఇలాంటి కామెట్స్ చెయ్యడం ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అంటే.. ఈ ఇంటర్వ్యూలో మీరు మాములుగా చేసుకునే పార్టీలో ఎక్కువగా జరిగే ఊహించని పరిణామాలు ఏంటి అని ప్రశ్నించారు.

దానికి మొదట రాశి సమాధానం ఇస్తూ.. డ్యాన్స్ చెయ్యడం అలాగే డ్రింక్స్ తీసుకోవడం అని పేర్కొంది. ఇక నాగ చైతన్య మాట్లాడుతూ.. మా ఒంటి మీద బట్టలు అనేవి ఉండవు. అలాగే బాటిల్స్ మొత్తం ఖాళీగా అయిపోతాయి అని చెప్పాడు. ఇక నాగ చైతన్య చెప్పినాన్ ఈ సమాధానంతో మొత్తం అందరూ షాక్ అవుతున్నారు. దీనిని ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె.. వీరిద్దరూ కలిసి నటించిన ఈ థాంక్యూ అనే సినిమా ఈ నెల 8న విడుదల కాబోతుంది. పెద్దగా అంచనాలు లేకుండా వస్తున్న ఈ సినిమా ఏం చేస్తుంది అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్


You may also like