Telugu News » Blog » మహేష్ బాబు అభిమానిగా మారిపోయిన నాగ చైతన్య…!

మహేష్ బాబు అభిమానిగా మారిపోయిన నాగ చైతన్య…!

by Manohar Reddy Mano
Ads

మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. ఉన్న ప్రతి హీరోకు ఎంతోకొంత తనదైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. కానీ అందులో చాలా మంది హీరోలు కొందరు స్టార్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోలలో ఎక్కువ మంది మేము మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య కూడా మరో హీరో ఫ్యాన్ గా మారిపోయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా చైతన్య మారిపోయినట్లు తెలుస్తుంది.

Ads

కానీ ఇది నిజ జీవితంలో కాదు. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా కే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా అనేది వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇలా సినిమాలో ఒక్క హీరో మరో హీరోగా కనిపించడం మాములే. కానీ ఒక్కే తరం హీరోగా కనిపించడం మాత్రమే కొత్త అనే చెప్పాలి. అంటే.. నాని ఒక్క సినిమాలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించాడు. అందులో చేతిపైన జై బాలయ్య అనే ట్యాటూ కూడా వేయించుకుంటాడు. కానీ నాని ఇప్పటి హీరో అయితే.. బాలయ్య అంతక ముందు తరం హీరో.

Ads

అయితే ఇప్పుడు నాగ చైతన్య విషయంలో ఇదే తేడా వస్తుంది. అదేంటంటే.. మహేష్ బాబు, నాగ చైతన్య దాదాపు ఒకే తరానికి చెందిన హీరోలు కావడం. ఇలా ఓ హీరో తన తోటి హీరోకు అభియామానిగా కనిపించబోతుండటం కొత్తే అని చెప్పాలి. ఇక ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నుండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మధ్యే ట్రైలర్ విడుదలైన ఈ థ్యాంక్యూ అనే సినిమా ఈ నెల 22న అభిమానుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా అనేది ఎలా ఉంటుంది అని చాలా మంది అభిమనులు ఎదురుచూస్తున్నారు.

Ad

ఇవి కూడా చదవండి :

విరాట్ కు ఎందుకు సపోర్ట్ చేసాడో చెప్పిన బాబర్..!

మరోసారి కోర్టుకు వెళ్లిన గంగూలీ..!