Home » ఆ సినిమాను పోలి ఉండనున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే.. నిజమేనా..?

ఆ సినిమాను పోలి ఉండనున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే.. నిజమేనా..?

by Azhar
Ad

పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన నడిపిస్తున్నాడు. అందులో ఆదిపురుష్ అనే సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. ప్రస్తుతం సాలార్ అలాగే ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఇందులో ఇంకా పేరు అనేది పెట్టని ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు అనేది తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఫ్యాన్స్ కు చాలా నమ్మకం ఉంది.

Advertisement

కానీ తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా కథ అనేది ఈ మధ్యే విడుదల అయిన శర్వానంద్ యొక్క ఓకే ఒక జీవితం సినిమా కథ మాదిరిగానే ఉంటుంది అని.. ఈ రెండు సినిమాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఓకే ఓకే జీవితం సినిమా టైం ట్రావెల్ మీద ఆధారపడిన సంగతి తెలిసిందే.

Advertisement

అందుకే ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా అలానే ఉంటుందా అనే అనుమాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. కానీ ఈ సినిమా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదు ప్రకటించారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత ఊపిరి అనేది పీల్చుకున్నారు అనే చెప్పాలి. అయితే చూడాలి మరి ప్రభాస్ యొక్క ఈ ప్రాజెక్ట్ కే సినిమా కథ ఎలా ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఆర్‌సీబీ వల్లే నేను ఈ ఘనత సాధించాను..!

పాక్ సెలక్షన్ పై విమర్శలు..!

Visitors Are Also Reading