ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన బ్యూటీలు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారుతున్న సంగతి తెలిసిందే. అమ్మ, అత్త, అక్క ఇలా సినిమాలోని ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా మారిన నటీమణులు ఒకప్పటి హీరోయిన్ నదియా కూడా ఒకరు. నదియా అప్పట్లో స్టార్ హీరోలకు జోడీగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
Advertisement
ఇక పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నదియా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటూ నదియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో పవన్ నిదియా మధ్య ఉండే ఎమోషనల్ సీన్లు క్లైమాక్స్ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. ఈ సినిమా తరవాత నదియా ఫుల్ బిజీ అవ్వడంతో వరుస సినిమాల్లో నటిస్తోంది.
Advertisement
ఇదిలా ఉండగా పవన్ కు అత్తగా నటించిన నదియా ఒకప్పుడు చిరంజీవికి జోడీగా నటించే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. చిరంజీవి హీరోగా నటుడు కైకాల సత్యనారయణ ఆయన సోదరుడు కైకాల సూర్యనారాయణ కలిసి చిరంజీవి అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కాగా ఈ సినిమా తరవాత మళ్లీ కైకాల చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నారు. ఈ సారి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలోనే కొదమసింహం సినిమా ప్రారంభించారు. కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్ లను ఎంపిక చేశారు. అందులో నదియా కూడా ఒకరు. అయితే నదియాకు అప్పటికే పెళ్లై అమెరికాకు వెళ్లడంతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అలా చిరు పక్కన నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.