Home » Bangarraju : “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ రిలీజ్..

Bangarraju : “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ రిలీజ్..

by Bunty
Ad

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా బంగార్రాజు. నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని బంగార్రాజు పాత్రను టైటిల్ గా చేసుకొని… అదే దర్శకుడితో నాగార్జున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో నాగార్జున డబల్ ఆక్షన్ చేయగా… ఈ సినిమాలో మాత్రం నాగచైతన్య మరో ప్రధానమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అలాగే టీజర్ లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “నా కోసం” సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సింగింగ్ సెన్సేషన్ సిద్దు శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడం తో ఈ సోలో ఫుల్ మెలోడీ ప్రేక్షకులకు మరింత అద్భుతంగా అనిపిస్తోంది. ఈ సాంగ్ లో నాగచైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య కు జోడిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఈ పాటలోనూ…. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా కుదిరింది. మొత్తానికి ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Visitors Are Also Reading