Home » వైకుంఠ ఏకాదశి కి తిరుమల వెళ్తున్నారా..? ఇవి తప్పక తెలుసుకోండి..లేకపోతే ఇబ్బందే…!

వైకుంఠ ఏకాదశి కి తిరుమల వెళ్తున్నారా..? ఇవి తప్పక తెలుసుకోండి..లేకపోతే ఇబ్బందే…!

by Sravya
Ad

చాలామంది ప్రతి ఏటా తిరుమల వెళుతూ ఉంటారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది అని, కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు చాలా మంది తిరుమల వెళ్తూ ఉంటారు కూడా. ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23న వచ్చింది వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని టీటీడీ పది రోజులు పాటు భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తుంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తిరుమల కి వెళ్లాలనుకునే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి.

Advertisement

ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు పది రోజులపాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల టికెట్లు కూడా టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలనుకుంటే డిసెంబర్ 22 నుండి కౌంటర్ల ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. తిరుపతిలో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 4.5 లక్షల టోకెన్ల టికెట్లు ని జారీ చేయబోతున్నారు.

Advertisement

రోజుకి 42 వేలు నుండి 500 వేల మందికి టికెట్లు ఇవ్వబోతున్నారు. ఈ సమయంలో ఆన్లైన్ టికెట్లు కొని వచ్చే భక్తులు 300 రూపాయల క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించునున్నారు. డిసెంబర్ 21 నుండి 24 వరకు డిసెంబర్ 30 నుండి జనవరి ఒకటో తేదీ వరకు సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని అధికారులు చెప్పారు. డిసెంబర్ 23 నుండి పది రోజులు పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలని రద్దు చేశారు. పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నారైలు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading