ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా లక్షద్వీప్ గురించే సెర్చ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ కి వెళ్లి వచ్చినప్పటినుండి కూడా లక్షద్వీప్ గురించి వెతుకుతున్నారు. పైగా భారతీయులు మాల్దీవ్స్ విమానాలని హోటల్ రూమ్స్ ని కూడా క్యాన్సల్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుండి త్వరగా ఇవన్నీ జరిగిపోతున్నాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ లక్షద్వీప్ కి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అక్కడికి వెళ్లే ముందు కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మాల్దీవ్స్ లానే లక్షద్వీప్ కూడా చాలా అందమైన ప్రదేశం.
Advertisement
Advertisement
ఇక్కడ సముద్ర జలాలు మంచి బీచ్లు, కోరల్ రీఫ్ ఇవన్నీ కూడా పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. అందుకే చాలామంది లక్షద్వీప్ కి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లక్షద్వీప్ కి వెళ్లాలంటే భారతీయులు కూడా అనుమతి తీసుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే మూడు నెలలు ముందుగానే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ ఉంటారు, ఎన్నిరోజులు ఉంటారు ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. లక్షద్వీప్ ని వెళ్లడానికి చలికాలం చాలా మంచి సమయం. ఈ టైం లో పర్యటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వెళుతూ ఉంటారు. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!