Home » మూడేళ్లు దాటితే ప్రామిస‌రీ నోటు చెల్ల‌దా…? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే అంతే సంగ‌తి..!

మూడేళ్లు దాటితే ప్రామిస‌రీ నోటు చెల్ల‌దా…? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే అంతే సంగ‌తి..!

by AJAY
Ad

ప్రామిస‌రీ నోటు అంటే చాలా మందికి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు. ప్రామిస‌రీ నోటు రాస్తారు రాయించుకుంటారు కానీ దాని గురించి మాత్రం సరిగ్గా తెలుసుకోరు. అయితే ప్రామిస‌రీ నోటు రాసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. దాని గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంటేనే రాయాలి కాబ‌ట్టి ఎలా రాయాలి అనేవిష‌యానికి సంబంధించి కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రామిస‌రీ నోటు పై ఏకంగా ఒక కోటి వ‌ర‌కూ డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చు.

Advertisement

డ‌బ్బుల‌ను వ‌డ్డీకి ఇచ్చే ముందు ప్రామిస‌రీ నోటును రాయించుకుంటారు. అస‌లు ప్రామిస‌రీ నోటు లీగ‌ల్ యేనా ఇది కోర్టులో ప‌నిచేస్తుందా అనే అనుమానులు కూడా ఉంటాయి. ప్రామిస‌రీ నోటు లీగ‌ల్ అంతే కాకుండా కోర్టులో చెల్లుబాటు అవుతుంది కూడా. ప్రామిస‌రీ నోటు రాయించుకున్న త‌ర‌వాత మూడేళ్ల లోపు అస‌లు కానీ క‌ట్ట‌క‌పోతే మూడ‌వ సంవ‌త్స‌రం లోపు ఎంతో కొంత చెల్లించిట్టు సంతకం తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఒకవేళ సంత‌కం గ‌న‌క తీసుకోక‌పోతే ఆ ప్రామిస‌రీ నోటు చెల్లుబాటు కాదు. మూడేళ్ల త‌ర‌వాత ప్రామిస‌రీ నోటు పీరియ‌డ్ పూర్త‌వుతుంది. మీరు స్వ‌యంగా వెళ్లి నోటు రాయించుకోలేక‌పోతే 30నెల‌ల లోపు లాయ‌ర్ తో నోటీసు ఇప్పించాలి. అలా చేస్తే కాల‌దోషం నుండి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. నెగోషియ‌ల్ ఇన్స్ట్రుమెంట్స్ చ‌ట్టం అనేది చాలా విస్తార‌మైనది. ఇదిలా ఉండ‌గా స్టాంప్ అంటించేట‌ప్పుడు మ‌రియు సంతకం తీసుకునేట‌ప్పుడు కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

also read :

చ‌నిపోయిన త‌ర‌వాత కాళి బొట‌న‌వేళ్ల‌ను ఎందుకు క‌డ‌తారో తెలుసా….?

Visitors Are Also Reading