Home » పెళ్ళికి ముందే మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి…లేదంటే అంతే సంగతి….!

పెళ్ళికి ముందే మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి…లేదంటే అంతే సంగతి….!

by AJAY
Ad

మానవ జీవితంలోని అతిముఖ్యమైన ఘట్టం పెళ్లి. సంసారాన్ని ఈదినోడు సముద్రాన్ని ఈదినట్టే అని చెపుతారు. అంటే పెళ్లి తరవాత వచ్చే సంసార జీవితం ఎంత విలువైనదో అర్థం చేుకుకోవచ్చు. కాబట్టి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసుకునే ముందే జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పెళ్లి తర్వాత తెలుసుకుని బాధపడితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అవుతుంది.

Advertisement

ముఖ్యంగా ఈ క్రింది నాలుగు విషయాలను తెలుసుకోవడం ద్వారా పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. సంతోషకరమైన జీవితానికి ముందుగా డబ్బు అవసరం కాబట్టి మీ జీవితభాగస్వామి ఉద్యోగం చేస్తున్నారా… జీతం ఎంత వస్తుంది అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలామంది తప్పుడు జీతాలను చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కఠినంగానే ఉండాలి.

Advertisement

పెళ్లి తర్వాత పిల్లలను కనే విషయంపై కూడా ముందే మాట్లాడుకుంటే మంచిది. కొంతమంది పెళ్లి తర్వాత కొన్నేళ్లపాటు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత పిల్లలను కనాలని అనుకుంటున్నారు. కాబట్టి ముందే భాగస్వామితో ఆ విషయంపై మాట్లాడుకుంటే మంచిది. జీవిత భాగస్వామికి పెళ్ళికి ముందు అప్పులు ఉన్నాయా ప్రతినెల అతడు ఏమైనా వడ్డీలు కడతాడా లాంటి విషయాలను కూడా ముందే తెలుసుకోవడం మంచిది. పెళ్లి తర్వాత ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని కూడా ముందే తెలుసుకుంటే మంచిది.

పెళ్లి తర్వాత కొంతమంది అత్తవారింట్లో ఉండడానికి ఇష్టపడరు. వేరు కాపురం పెట్టడానికి ఇష్టపడతారు. కాబట్టి పెళ్లి తర్వాత వేరు కాపురం కోసం గొడవలు పెట్టుకునే కంటే ముందే ఆ విషయంపై మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే పెళ్లయిన కొద్ది కాలంలోనే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చివరికి ఈ గొడవలు భార్య భర్తలు విడిపోయే వరకు కూడా వెళ్ళవచ్చు. ఈ విషయాలతోపాటు చాలా విషయాలను పెళ్లికి ముందే జీవిత భాగస్వామితో పంచుకొని ఒక క్లారిటీకి రావడం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది.

Visitors Are Also Reading