Music School Review:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన శ్రియ శరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ మ్యూజిక్ స్కూల్. మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంగీత నాటక నేపథ్యంతో తెరకేక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
తారాగణం:
శ్రియ శరన్, శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్, ఓజుబారువా, గ్రేసీ గోస్వామి, తదితర నటులు.
Advertisement
స్టోరీ:
ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివి డాక్టర్లు కావాలని, లేదంటే ఇంజనీర్లు ఏదో ఒక జాబ్ చేయాలని మొదటినుంచి ఒత్తిడి చేస్తూనే ఉంటారు. కానీ వారిలో ఏ కల ఉంది అనేది గుర్తించరు. కేవలం చదువు చదువు అంటూ వారికి ఇష్టం లేనిది కూడా వారిపై రుద్ది ఒత్తిడికి గురి చేస్తారు. అలాంటి బేస్ కథతో ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా కథ ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి దాని ప్రోత్సహించడమే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం.
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని దరి చేరనీయకూడదు
Advertisement
చాలామంది పిల్లలకు సంగీతం, డాన్స్ వంటి ఇతర కలలు ఇష్టం ఉంటాయి. ఆ కలలను ప్రోత్సహించి వారిని అందులో తీర్చిదిద్దాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ పాపారావు బియ్యాల.
ఆయన డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం..
అయితే ఈ సినిమాని ఇప్పటికే తీసినటువంటి కథల విధంగానే తీశారు. కొత్తగా ఏమీ అనిపించడం లేదు. కానీ పిల్లలకు మ్యూజిక్ అనేది నేర్పించాలని కాన్సెప్ట్ బాగా ఉంది. చాలావరకు బోర్ అనిపిస్తుంది. కానీ పిల్లలను కేవలం చదువుపై ఒత్తిడి చేయవద్దు అని ఒక కాన్సెప్టు బాగుందని చెప్పవచ్చు.
also read:ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !
ఇందులో శ్రియ శరన్, శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్, గ్రేసీ గోస్వామి మిగిలిన నటీనటులు వారి నటనతో అదరగొట్టారు. డైరెక్టర్ కు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను అందించలేకపోయారు..
ఇక చివరిగా సంగీత చలనచిత్రంగా రూపొందించిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకోలేదు. ఏది ఏమైనా సినిమా తల్లిదండ్రులు మీ పిల్లల కోసం ఒకసారి చూడవచ్చు.
రేటింగ్:1/5
also read:“జగదేకవీరుడు అతిలోకసుందరి” మూవీ వెనుక ఇంత కథ ఉందా..!